Siraj - Zanai Bhosle: లెజెండరీ గాయని మనవరాలితో సిరాజ్.. ఏం చేస్తున్నాడో చూడండి..!

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా అతడు లెజండరీ గాయని ఆశా భోంస్లే మనవరాలు జనాయ్ భోంస్లేతో డ్యూయెట్ సాంగ్ పాడాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Siraj Duet With Asha Bhosle Granddaughter Zanai Bhosle Goes Viral Ahead Of Champions Trophy 2025

Siraj Duet With Asha Bhosle Granddaughter Zanai Bhosle

టీమిండియా (Team India) స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Siraj - Zanai Bhosle) ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) కి ముందు మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా అతడు ఓ యువతితో కలిసి డ్యూయెట్ సాంగ్ పాడాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఆమె ఎవరా అంటూ నెటిజన్లు, అభిమానులు తెగ గుసగసలాడుకుంటున్నారు. అయితే ఆమె లెజెండరీ గాయని ఆశాభోస్లే మనవరాలు అని తెలిసింది. 

సింగర్‌గా సిరాజ్

ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆశాభోస్లే మనవరాలు జనై భోస్లేతో సిరాజ్ డ్యూయెట్ సాంగ్ పాడాడు. అందుకు సంబంధించిన వీడియోను సైతం అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఇటీవల పోస్టు చేశాడు. అలాగే తాజా మ్యూజిక్ ఆల్బమ్‌లోని ‘కెహందీ హై’ సాంగ్‌ను సిరాజ్ - జనై భోస్లే కలిసి పాడారు. అందుకు సంబంధించి వీడియోను సిరాజ్ పోస్టు చేస్తూ.. ఈ సాంగ్.. మనమంతా మన కలల్ని అనుసరించడానికి కారణమైన వ్యక్తి కోసం అని పేర్కొన్నాడు. అంతేకాకుండా నువ్వు ఎప్పటికీ ది బెస్ట్ అంటూ జనైపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Also Read: Anand Mahindra: భారత్‌ లో టెస్లా..ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

జనై భోస్లే - సిరాజ్ ప్రేమ

మహ్మద్ సిరాజ్ ప్రేమలో పడినట్లు గత కొద్ది రోజుల క్రితం వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. జనై భోస్లేతో అతడు ప్రేమాయణం సాగిస్తున్నట్లు జోరుగా వార్తలు సాగాయి. అందులోనూ ముంబైలోని బాంద్రాలో జరిగిన ఆమె బర్త్ డే పార్టీకి కూడా సిరాజ్ హాజరు కావడంతో మరింత రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై గతంలో సిరీజ్ స్పందించాడు. జనై భోస్లే తనకు చెల్లిలాంటిదని అన్నాడు. ఆమె లాంటి సోదరి తనకెవరూ లేరని తెలిపాడు. ఆమె లేకుండా తాను ఎక్కడా ఉండాలనుకోనని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ వార్తలపై జనైభోస్లే సైతం రియాక్ట్ అయ్యారు. సిరాజ్ తనకు ప్రియమైన సోదరుడని క్లారిటీ ఇచ్చారు. దీంతో వీరిపై తలెత్తిన రూమర్స్‌కు చెక్ పడినట్లైంది. 

Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే  నో రిఫండ్‌.. ఐటీ శాఖ ఏమందంటే!

Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు