Shreyas Iyer: కప్ గెలవకపోయినా టాప్ లో పంజాబ్..సక్సెస్ ఫుల్ కెప్టెన్ శ్రేయస్

మూడు వేర్వేరు జట్లు...మూడింటినీ ఫైనల్స్ కు చేర్చాడు. ఈ ఘనత ఒక్క పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కే దక్కింది. ఈసారి ఫైనల్ లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన టేబుల్ టాప్ మాత్రం పంజాబ్ కింగ్స్ ను నిలబెట్టాడు. సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. 

New Update
ipl

Shreyas Iyer

Shreyas Iyer: లాస్ట్ ఇయర్ కొలకత్తా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఛాంపియన్.. అప్పుడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. షారుక్ ఖాన్ ఈసారి అయ్యర్ ను వదులుకున్నాడు.. పంజాబ్ కెప్టెన్(Punjab Captain) గా అయ్యర్ జట్టును టాప్ లోకి తీసుకువచ్చాడు. పంజాబ్ ను మొట్టమొదటి సారి ఫైనల్(IPL 2025 Final) కు చేర్చాడు. మూడు వేర్వేరు జట్లకు ప్రాతనిధ్యం వహించి ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక సారథిగా నిలిచాడు. 2020 సీజన్‌లో దిల్లీ, 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను టైటిల్‌ పోరుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు పంజాబ్‌ కింగ్స్‌ను కూడా ఫైనల్కు చేర్చాడు. దీంట్లో బెంగళూరు(RCB) చేతిలో ఓడిపోయినా కూడా రన్ రేట్ లో పంజాబ్ ను టాప్ లో నిలబెట్టాడు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా పంజాబ్ టేబుల్ టాప్ లోనే ఉంది అంటే ఆ క్రెడిట్ మొత్తం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కి మాత్రమే దక్కుతుంది. 

Also Read:ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు

కుర్రాళ్ళను ఒక్క తాటిపైకి తెచ్చి..

సూపర్ స్ట్రైక్‌రేట్‌తో  ఈ సీజన్ మొత్తం అద్భుత ఫామ్ కనబర్చాడు శ్రేయస్. తన కెప్టెన్సీ స్కిల్స్‌తో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్లాడు. 41 బంతుల్లో 87 పరుగులు బాది తన పవరేంటో చూపించాడు. అనుభవం లేని కుర్రాళ్ళను ఒక్కతాటిపై చేర్చి బ్యాటర్లతో పరుగులను, బౌలర్లతో వికెట్లను రాబట్టాడు. ఐపీఎల్ లో అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్లు ఎవరంటే ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ పేర్లు చెబుతారు. వీళ్ళిద్దరూ జట్టుకు ఐదు సార్లు కప్ ను అందించారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి స్థానాన్ని శ్రేయస్ అయ్యర్ కొట్టేశాడు. ఇతను వేర్వేరు జట్లకు సారధిగా వ్యవహరిస్తూ.. ప్రతి జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లి తాను సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకున్నాడు. గత సీజన్లో కోలకత్తాకు కప్ ను కూడా అందించాడు. ఈ సారి ఫైనల్ లో చివర వరకూ కూడా పోరాటపటిమను చూపించాడు. 

Also Read:ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్

Also Read: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్

Also Read:కెప్టెన్ మారాడు కథ మారింది..

Advertisment
తాజా కథనాలు