Shikhar Dhawan: బీసీసీఐ నిర్ణయాలపై ధావన్ సంచలన వ్యాఖ్యలు.. అది తప్పనిసరి అంటూ!

ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలపై శిఖర్ ధావన్ సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్‌ ఆడటం తప్పనిసరి చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపాడు. అలాగే ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూడాలన్నాడు. 

New Update
bcci

Shikhar Dhawan

Shikhar Dhawan: ఆటగాళ్లను ప్రోత్సహించేదుకు బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలపై మాజీ భారత క్రికెటర్ శిఖర్ ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్‌ ఆడటం తప్పనిసరి చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే పనిభారం పడకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించాడు. 

తప్పనిసరి చేయడం బాగుంది..

ఈ మేరకు ఛాంపియన్ ట్రోఫీలో పాక్ పై భారత్ ఘన విజయం సాధించిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ధావన్.. బీసీసీఐ నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటున్నాయన్నారు. 'దేశవాళీ క్రికెట్‌ ఆడటం తప్పనిసరి చేయడం బాగుంది. ఇది భారత క్రికెట్ కు ఎంతో ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూడాలి. ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో ఆడుతుండటం సంతోషం. ఢిల్లీ తరఫున విరాట్‌ కోహ్లి ఆడినప్పుడు స్టేడియం నిండిపోయింది' అని గుర్తు చేశాడు. 

ఇది కూడా చదవండి: SLBC UPDATES: పెరుగుతున్న బురద నీరు.. ఏ క్షణమైనా కన్వేయర్ బెల్టు తెగే ప్రమాదం!

ఇదిలా ఉంటే.. బెస్ట్ ఫీల్డర్ విన్నర్‌ను ప్రకటించడానికి టీమ్‌ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి శిఖర్ ధావన్‌ ను దిలీప్‌ ఆహ్వానించారు. ఆటగాళ్లంగా చప్పట్లు కొడుతూ ధావన్‌ను స్వాగతం పలికారు. బ్యాటింగ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌, శ్రేయస్ అయ్యర్‌లను ధావన్ ప్రశంసించాడు. చివరకు అక్షర్ పటేల్‌ ను బెస్ట్ ఫీల్డర్‌గా ప్రకటించి మెడల్‌ అందించాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చదవండి: మహాశివరాత్రి రోజున రాశీ ప్రకారం ఈ దానాలు చేస్తే.. సమస్యలన్నీ పరిష్కారం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు