/rtv/media/media_files/2025/05/03/OL14N2Alb5NycQunZiut.jpg)
సీఎస్కేతో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో ఆర్సీబీ బ్యాటర్ రొమారియో షెపర్డ్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. కేవలం 14 బంతుల్లో 50 పరుగులు చేసి ఐపీఎల్ 2025 సీజన్‌లో ఎవరూ అందుకోలేని సంచలన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన అర్ధశతకం కావడం విశేషం. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 4, 6, 6, 4 కొట్టేశాడు. కాగా ఐపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన వారిలో మొదటి ప్లేస్‌లో యశస్వీ జైస్వాల్ ఉన్నాడు. అతడు 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 13 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
Romario Shepherd vs Khaleel Ahmed 19th Over Ball-By-Ball🔥🔥
— A (@cmmoncheeks) May 3, 2025
pic.twitter.com/ae5OLam5yS
Romario Shepherd, for sheer power and dominance. 😌
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 3, 2025
pic.twitter.com/GvP79IR5fG
ఇది కూడా చూడండి: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు
ఆర్సీబీ స్కోర్
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటర్లు దుమ్ము దులిపేశారు. చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు. తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేశారు. దీంతో సీఎస్కే ముందు 214 టార్గెట్ ఉంది. ఆర్సీబీ బ్యాటర్లలో ఓపెనర్లు చెలరేగిపోయారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో విజృంభించారు. చివరి రెండు ఓవర్లలో ఆర్సీబీ ఏకంగా 54 పరుగులు పిండుకుంది.
ఇది కూడా చూడండి: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!
ఇది కూడా చూడండి: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!
ఎవరెన్ని కొట్టారంటే?
ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 62, జాకబ్ బెతెల్ 55, రొమారియో షెఫర్డ్ 53* రాణించారు. దేవ్‌దత్ పడిక్కల్ 17, రజత్ పటీదార్ 11, జితేశ్ శర్మ 7, టిమ్ డేవిడ్ 2 విఫలమయ్యారు. ఇక చెన్నై బౌలర్లలో మతీష పతిరన 3 వికెట్లు, సామ్ కరన్ 1 వికెట్, నూర్ అహ్మద్ 1 వికెట్ తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
csk-vs-rcb | telugu-news | latest-telugu-news | Romario Shepherd