భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాతృత్వం అనుభవాలను, రిటైర్ కావడానికి గల కారణాల గురించి ఓ పాడ్ కాస్ట్ లో పంచుకున్నారు. గర్భధారణ సమయంలో కంటే తల్లిపాలు ఇస్తున్నప్పుడు తాను ఎక్కువగా అలసిపోయానని సానియా తెలిపింది. శారీరక అంశాల కంటే తల్లిపాలు ఇవ్వడంలోని భావోద్వేగ అంశాలే తనను ఎక్కువగా బాధించాయన్నారు సానియా. ఉద్యోగం చేసే మహిళలకు తల్లిపాలు ఇవ్వడం చాలా కష్టమైన పని అని ఆమె చెప్పుకొచ్చారు. తన కొడుకు ఇజాన్ పుట్టిన తర్వాత 3 నెలలే పాలిచ్చానని తెలిపారు.
Also read : పెళ్లికెళ్తే చచ్చేంతపనైంది.. తేనెటీగల దాడిలో స్పాట్‌లోనే 50 మంది!
మానసికంగా కుంగిపోయా
కొడుక్కి పాలిచ్చే క్రమంలో తాను శారీరకంగా, మానసికంగా కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ఆటపరంగా, ఇతర పనులు, నిద్రలేమి సమస్యలు ఎదురయ్యాయని సానియా మీర్జా వెల్లడించారు. అప్పుడు తనకు బ్రెస్ట్ ఫీడింగ్ కష్టమనిపించిందని.. ఆ తర్వాత తన శరీరం ఆటకు సహకరించకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించానంటూ ఆమె చెప్పుకొచ్చారు. రిటైర్ అయ్యాక తన కొడుకుతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నానని సానియా స్పష్టం చేసింది. 2018 అక్టోబర్ 30న తన ప్రసవానికి ముందు రాత్రి కూడా టెన్నిస్ ఆడుతూ శారీరకంగా ఫిట్‌గా ఉన్నానని ఆమె గుర్తుచేసుకుంది. ప్రెగ్నెన్సీ ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే బ్రెస్ట్‌ఫీడింగ్ చాలా కష్టంగా అనిపించిందని తెలిపింది. మరో మూడు సార్లు తాను గర్భందాల్చినా.. బ్రెస్ట్‌ఫీడ్ మాత్రం చేయలేను అనుకుంటా అని చెప్పుకొచ్చింది.
"I breastfed for 2.5-3 months. For me, that was the hardest part of pregnancy," said Sania Mirza. #SaniaMirza #Motherhood #SocialDiaryMagazine pic.twitter.com/pnJhSAJMIH
— Weekly Social Diary (@SocialDiaryMagz) April 25, 2025
Also Read : CM Yogi Adityanath : ఉత్తరప్రదేశ్‌లో 1,200 మంది పాకిస్తానీలు.. ఏరివేత షురూ చేసిన యోగి!