/rtv/media/media_files/2025/04/25/vyb6VVx9TUmoqMfUJr3M.jpg)
cm-yogi-Pakistan
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తోందని ఆరోపిస్తూ భారత ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది. దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకోవడంతో పాటుగా సింధు జలాల రద్దు, పాక్ జాతీయులు వీసాలు రద్దు చేస్తూ కీలక ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 29వరకు ఎవరైనా పాకీస్థానీలు ఇండియాలో ఉంటే వెళ్లిపోవాలని ఆర్డర్స్ పాస్ చేసింది. అక్రమంగా ఇండియాలో ఉంటే మాత్రం చర్యలు దారుణంగా ఉంటాయని హెచ్చరించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్లు చేసి హై అలర్ట్ ప్రకటించి, పాకిస్థానీయులను వెనక్కి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read : పొరపాటున కూడా స్నేహితులకు ఇవి చెప్పకండి
Meerut, Uttar Pradesh: Bhanu Bhaskar, ADG Meerut Zone, informed that following the recent terrorist attack in Pahalgam, Pakistani nationals, including those visiting relatives, were sent back to Pakistan from the Meerut Zone pic.twitter.com/uVk1JsPQad
— IANS (@ians_india) April 25, 2025
Also Read : ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?
ఉత్తరప్రదేశ్‌లో 1,000 నుండి 1,200 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా ఆ రాష్ట్ర అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం నుండి అధికారిక బహిష్కరణ ఉత్తర్వులు రాగానే వారిని బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పాకిస్తానీలను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని అధికారులు తెలిపారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 27వ తేదీతో వీసాలు రద్దవుతాయి. మెడికల్ వీసాదారులకు ఏప్రిల్ 29 వరకు గడువు ఉంటుంది. కాగా ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకపు పర్యాటకులు మరణించారు.
Also Read : సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టంపై 1332పేజీల కౌంటర్ దాఖలు చేసిన కేంద్రం
హైదరాబాద్ లో 208మంది పాకిస్థానీలు
తెలంగాణలో పాకిస్థానీలందరూ వెంటనే భారత్ ను వీడాలని తెలంగాణ డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 27వ తేదీతో వీసాలు రద్దవుతాయని, మెడికల్ వీసాదారులకు ఏప్రిల్ 29 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 30 వరకు అటారి వాఘ బార్డర్ ఓపెన్ ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న పాకిస్తానీయులపై నిఘా పెట్టామన్న డీజీపీ.. అక్రమంగా తెలంగాణలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా హైదరాబాద్ లో 208మంది పాకిస్థానీలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Also Read : ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!
cm-yogi-adityanath | amit shah