/rtv/media/media_files/2025/04/09/dt1y35BVm8KsPuQa5GWW.jpg)
GT VS RR
గుజరాత్ ఇచ్చిన భారీ లక్ష్యం 217 పరుగులను సాధించడంలో సంజూ శాంసన్ టీమ్ తడబడింది. దీంతో గుజరాత్ ఓటమన్నదే లేకుండా వరుసగా నాలుగో విజయ దక్కినట్టయింది. 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. దీంతో 218 పరుగులతో ఆర్ఆర్ లక్ష్య ఛేదనకు దిగింది. కానీ 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిపోయింది. హెట్ మయర్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సెక్స్లతో హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 41 పరుగులు బాదాడు. రియాన్ పరాగ్ 14 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్ లతో 26 మెరుపులు మెరిపించాడు. అయితే మిగతా వారు సింగిల్ డిజిట్లకే అవుట్ అయిపోవడంతో మ్యాచ్ ను నిలబెట్టుకోలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, రషీద్ ఖాన్ 2, సాయి కిశోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, కుల్వంత్ కెజ్రోలియా ఒక్కో వికెట్ తీశారు.
అదరగొట్టిన సాయి సుదర్శన్..
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇవాళ 23వ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకోగా గుజరాత్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తాజాగా గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. దీంతో రాజస్తాన్ ముందు 218 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెన్ గా వచ్చిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ 2 అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బట్లర్, సాయి సుదర్శన్ కలిపి పరుగుల వరద పారించారు. గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ చెండాడేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో సుదర్శన్ పరుగుల వరద పెట్టించాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఊపు తెప్పించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 53 బాల్స్‌లో 82 పరుగులు సాధించాడు. తుషార్ దేశ్ పాండే వేసిన 18.2 ఓవర్‌లో వికెట్ కీపర్ సంజుశాంసన్‌కు క్యాచ్ ఇచ్చి సాయిసుదర్శన్ (82) వెనుదిరిగాడు. ఇతనితో పాటూ బట్లర్ 25 బంతుల్లో 36 పరుగులు, షారుక్ 20 బంతుల్లో 36 పరుగులు, తివాటి 12 బంతుల్లో 24 పరుగులతో మెరుపులు మెరిపించారు.
today-latest-news-in-telugu | IPL 2025 | gujarath | rajasthan
Also Read: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం