Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత షట్లర్ పీవీ సింధులో మొదటి రౌండ్ లో విజయం సాధించింది. దీంతో ఈ మధ్య కాలంలో వరుసగా మ్యాచ్ లు ఓడిపోతున్న సింధుకు చాలా రోజుల తర్వాత గెలుపు దక్కినట్టయింది.

New Update
badminton

P.V.Sindhu

ప్రపంచ బ్యాడ్మింటిన్ సింగిల్స్ లో 17వ ర్యాంకులో ఉన్న పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో తన సత్తా మరో మారు చాటింది. చైనాలోని నింగ్బోలో జరుగుతున్న ఈ ట్రోఫీలో సింధు మొదటి రౌండ్ లో విజయ సాధించింది. 36 వ ర్యాంకులో ఉన్న ఇండోనేషియా ప్లేయర్ మీద 21-15, 21-19లతో వరుసగా రెండు గేమ్ లలో గెలిచి పైచేయి సాధించింది. దీంతో సింధు రెండో రౌండ్ కు వెళ్ళనుంది. 

మెన్ సింగిల్స్ లో ఓటమి..

మరోవైపు బాయ్స్ సింగిల్స్ లో భారత షట్లర్ లక్ష్య సేన్ మాత్రం మొదట మ్యాచ్ లోనే ఓడిపోయాడు. దీంతో మొదటి స్థాయిలోనే  మెన్ సింగిల్స్ లో నిరాశ ఎదురైంది. అయితే డబుల్స్ లో మాత్రం లక్ష్య సేన్, హెచ్ ఎస్ ప్రణయ్ రాయ్ లు మాత్రం మ్యాచ్ గెలిచి ముందంజ వేశారు.

today-latest-news-in-telugu | pv-sindhu | badminton | asia 

Also Read: USA: చైనా అయిపోయింది ఇప్పుడు ఈయూ వంతు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు