/rtv/media/media_files/2025/05/14/A6BdAWNExXjOwAFCdpnN.jpg)
Rohith Sharma Politics
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని రోజులకే రోహిత్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను కలవడం చర్చనీయాంశమైంది. గంటకు పైగా ఇద్దరి మధ్య భేటీ జరగడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.
Captain Rohit Sharma clicked with Maharashtra CM Devendra Fadnavis.
— Mamta Jaipal (@ImMD45) May 14, 2025
🔥💫
Rohit Sharma will enter politics after cricket ✌️❤️#RohitSharma𓃵#Cricket@ImRo45pic.twitter.com/2hBNojIRFB
ఇది కూడా చూడండి: Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ
సోషల్ మీడియా ద్వారా..
ఇదిలా ఉండగా ఇటీవల భారత సారథి రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించి పోస్ట్ పెట్టిన రోహిత్.. 67 టెస్టులాడి 4,301 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధ శతకాలుండగా అత్యధిక స్కోర్ 212 ఉంది.
ఈ మేరకు వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటనకు కొత్త కెప్టెన్‌తో వెళ్లాలని జాతీయ సెలెక్టర్లు నిర్ణయించారు. దీంతో కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగించనున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ విషయం ముందుగానే గమనించిన రోహిత్ టెస్టుల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేసినట్లు సమాచారం. 38 ఏళ్ల రోహిత్ ఇప్పటికే T20లకు వీడ్కోలు పలకగా ఇక వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు.
ఇది కూడా చూడండి: Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..
rohith-sharma | maharastra
Follow Us