Rohit Sharma: రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్..  కెప్టెన్సీ నుంచి ఔట్ !

రోహిత్ శర్మకు  బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వన్డేలకు  మాత్రమే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి అతని స్థానంలో శుభ్‌మాన్ గిల్ కు బాధ్యతలు అప్పగించే ఆలోచనలో బీసీసీఐ  ఉన్నట్లుగా తెలుస్తోంది.

New Update
rohit bcci

Rohit Sharma: టెస్ట్, టీ20 ఫార్మట్ల నుంచి తప్పుకున్న రోహిత్ శర్మకు  బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వన్డేలకు  మాత్రమే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి అతని స్థానంలో శుభ్‌మాన్ గిల్ కు బాధ్యతలు అప్పగించే ఆలోచనలో బీసీసీఐ  ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై జాతీయ మీడియాలో  కథనాలు కూడా వస్తున్నాయి.

Also Read:Mogali Rekulu: మొగలిరేకులు ఆపేయడానికి కారణం నేనే!.. అసలు విషయం బయటపెట్టిన RK నాయుడు!

శుభ్‌మాన్ గిల్  కెప్టెన్ గా

త్వరలో శ్రీలంకతో  జరగబోయే వన్డే సిరీస్ కు  శుభ్‌మాన్ గిల్  కెప్టెన్ గా వ్యవహరిస్తారని రాసుకొచ్చాయి.  దీనిపై  రోహిత్ శర్మతో బీసీసీఐ పెద్దలు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.  దీనిపై త్వరలో అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గిల్ అద్భుతమైన బ్యాటింగ్, ముఖ్యంగా వన్డేల్లో అతని నంబర్.1 ర్యాంక్, అలాగే టెస్టుల్లో కెప్టెన్‌గా అతని విజయవంతమైన ఆరంభం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి.

Also Read: BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్

రోహిత్ శర్మ ప్రస్తుతం భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతానికి, శుభ్‌మాన్ గిల్ భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇటీవల, రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత గిల్‌ను ఈ బాధ్యతలకు నియమించారు. 2027 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, రోహిత్, విరాట్ కోహ్లీతో కలిసి వన్డేలు ఆడటం కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. రోహిత్ , కోహ్లీ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తిరిగి రావాల్సి ఉంది, కానీ ఈ సిరీస్‌ను BCCI , BCB పరస్పర నిర్ణయంతో వచ్చే ఏడాది వరకు వాయిదా వేశాయి. 

Also Read: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

Advertisment
Advertisment
తాజా కథనాలు