Hyderabad: రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో భార్యను ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించిన ఘటన యావత్ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. గురుమూర్తి అత్యంత కిరాతకంగా మటన్ కొట్టే కత్తితో భార్య మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. ఎముకలు నుంచి మాంసాన్ని వేరు చేసి ఉడికించాడు. ఇంతటితో అతడి పైశాచికం ఆగలేదు. ఎముకలను కాల్చి దంచి పొడి చేశాడు. ఆ తర్వాత వీటన్నింటినీ కవర్లో మూటకట్టి డ్రైనేజీలో చెరువులో పడేశాడు.
Also Read: Mahakumbh Mela 2025: పాపం.. మోనాలిసాకు టార్చర్.. వీడియోలు వైరల్!
వీడు మనిషేనా.. కుక్కతో శవంతో
అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి సంచలనాలు విషయాలు వెలుగుచూశాయి. గురుమూర్తి భార్యను ముక్కలుగా నరికే ముందు ప్రాక్టీస్ కోసం కుక్కను నరికి చంపినట్లు తెలుస్తోంది. వాటర్ హీటర్ ఆన్ చేసి బకెట్ లో నీళ్లలో 6 గంటల పాటు భార్య మాంసపు ముక్కలను ఉడికించి.. ఆ తర్వాతమా మళ్ళీ కుక్కర్లో ఉడికించి.. ఎండబెట్టి ఏమాత్రం ఆనవాళ్లు లేకుండా పొడిచేసి చెరువులో కలిపాడు.
ఆధారాలేవీ..
మరో వైపు గురుమూర్తి కేసు విచారణలో పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తన భార్యను తానే హత్య చేసి ముక్కలు చేశాను అని చెప్తూనే... నేను చంపాను అనడానికి ఆధారాలు ఏవీ అని పోలీసులను ప్రశ్నిస్తున్నాడు. పైగా కోర్టులో మీ సంగతి చూసుకుంటాను అని పోలీసులనే బెదిరిస్తున్నాడు. గురుమూర్తే హత్య చేశాడని తెలుస్తున్నా...ఒక్క ఆధారం కూడా దొరకక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.
ఆర్మ్ ఆఫీసర్ గా ఉద్యోగం
గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశారు. ఆ తర్వాత రిటైరయ్యారు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం ఇతడికి వెంకటమాధవితో పెళ్లి జరిగింది. వీళ్లకు ఇద్దరు సంతానం. వెంకటమాధవి కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలో మరిన్ని వివరాలు బయటపెడతామని మీర్‌పేట పోలీసులు వెల్లడించారు.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!