Bumrah: బుమ్రా వికెట్‌పై 100 డాలర్ల బెట్.. బీసీసీఐ పోస్ట్ వైరల్! బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రాక్టీస్ సెషన్ లో బుమ్రా, పంత్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. నెట్ లో బుమ్రాకు బౌలింగ్ వేసిన పంత్.. ‘నిన్ను ఔట్ చేస్తా. వంద డాలర్ల బెట్‘ అంటూ సవాల్ విసిరాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. By srinivas 15 Nov 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి Border-Gavaskar : బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన టీమ్ ఇండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. నెట్స్‌లోనూ భారత ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. అయితే మరో వారం రోజుల్లో 5 టెస్టుల సిరీస్ మొదలుకానుండగా.. బుధవారం ఇంట్రాస్క్వాడ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతున్న క్రమంలో బుమ్రా, రిషభ్ పంత్ మధ్య ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. పంత్ బౌలింగ్ ను ఇల్లీగల్ యాక్షన్ అంటూ బుమ్రా వాదించగా.. నిన్ను మరో బంతికి ఔట్ చేస్తా. వంద డాలర్ల బెట్ అంటూ పంత్ సవాల్ విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. Also Read : ప్రధాని మోదీకి తప్పిన పెను ప్రమాదం.. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) Also Read : షాకింగ్.. స్మశానంలో అఘోరీ పూజలు.. వీడియో వైరల్! పంత్ బౌలింగ్ యాక్షన్ ఇల్లీగల్.. ఈ మేరకు మొదట.. బుమ్రా నిన్ను ఔట్ చేస్తా. మోర్నీ మోర్కెల్ ఇందుకు సాక్ష్యం అంటూ బౌలింగ్ చేశాడు పంత్. అయితే బంతిని బుమ్రా లెగ్ సైడ్ మీదుగా కొట్టగా అది క్యాచ్ ఔట్ అంటూ పంత్ చెప్పాడు. దీంతో పంత్ బౌలింగ్ యాక్షన్ ఇల్లీగల్. అది ఔట్ కాదు. అది బౌండరీ వెళ్లింది. ఫుల్ షాట్ చక్కగా ఆడాను. సర్కిల్‌లో ఏడుగురు ఫీల్డర్లకు పర్మిషన్ లేదు. అసలు బౌలింగ్ చేయడానికే వీల్లేదు అంటూ బుమ్రా చెప్పుకొచ్చాడు. ఇది కూడా చదవండి: High Court: మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారమే: బాంబే హైకోర్టు దీంతో బుమ్రా ఔట్ అయ్యాడా? లేదా? చెప్పు అంటూ బౌలింగ్ కోచ్ మార్కెల్ ను పంత్ అడిగాడు. దీంతో నీ బౌలింగ్ యాక్షన్ చూస్తుంటే హషీమ్ ఆమ్లా గుర్తుకొస్తున్నాడని మార్కెల్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఈ ఫన్నీ వీడియోను బీసీసీఐ అధికారికంగా పోస్ట్ చేయగా.. నవ్వులు పూయిస్తోంది. క్రికెట్ లవర్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తూ ఫిదా అవుతున్నారు. ఇది కూడా చదవండి: వదిన అక్రమ సంబంధానికి మరదలు బలి.. ఇదో దుర్మార్గపు క్రైమ్ కథ! #border-gavaskar-trophy #rishabh-pant #bumrah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి