షాకింగ్.. స్మశానంలో అఘోరీ పూజలు.. వీడియో వైరల్!

లేడీ అఘోరీ తాజాగా వరంగల్‌లో ప్రత్యక్షమైంది. అక్కడ ఒక స్మశానంలో అఘోరీ కార్తీక పౌర్ణమి పూజలు చేసింది. అనంతరం భద్రకాళి అమ్మవారి ఆలయానికి పాదయాత్రగా వెళ్లింది. అత్యాచారాలు, గోహత్యల నివారణకే పూజలు చేశానని తెలిపింది. ఈ క్రమంలో అఘోరీని చూసేందుకు జనం ఎగబడ్డారు.

New Update

రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ నుంచి ఇటీవలే ఏపీకి మకాం మార్చిన అఘోరీ పలు ఆలయాలను సందర్శిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే మీడియాతో ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కుంభమేళా తర్వాత తన కార్యచరణ మరింత ఉధృతం చేస్తానని అఘోరి చెప్పుకొచ్చింది. కాగా రీసెంట్‌గా హైదరాబాద్ చేరుకున్న అఘోరి చైతన్యపురిలో ప్రత్యక్షమైంది. హిందూ దేవాలయాలు, మహిళలు, గోవులపై దాడి చేస్తున్న వారిని శిక్షించకపోతే తాండవం చేస్తానని హెచ్చరించింది. 

Also Read: మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారమే: బాంబే హైకోర్టు

స్మశానంలో కార్తీక పౌర్ణమి పూజలు

ఇక తాజాగా హైదరాబాద్ నుంచి వరంగల్‌లో అఘోరీ ప్రత్యక్షమైంది. ఇవాళ కార్తీక పౌర్ణమి కావడంతో ఓ స్మశానంలో కార్తీక పౌర్ణమి పూజలు చేసింది. అనంతరం భద్రకాళి అమ్మవారి ఆలయానికి పాదయాత్రగా వెళ్లి పూజలు చేసింది. అత్యాచారాలు, గోహత్యల నివారణకే పూజలు చేశానని తెలిపింది. అంతేకాకుండా లోక కల్యాణం, సనాతన ధర్మాన్ని కాపాడుతానని పేర్కొంది. అయితే పోలీసులు తనకు పూజలు చేసుకోనివ్వడం లేదని అఘోరి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఆమె పూజలు చేస్తున్న సమయంలో అఘోరిని చూసేందుకు జనం ఎగబడ్డారు. 

ఇకపోతే అఘోరీ తాజాగా షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. హిందూ దేవాలయాలు, మహిళలపై దాడి చేస్తున్న వారి మర్మాంగాన్ని కొయ్యబోతున్నానంటూ హెచ్చరించింది. అంతే కాకుండా అందరం కలిసికట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చింది. ‘ఆడపిల్లలను కాపాడుకుందాం, గోహత్యలను ఆపుదాం. ప్రకృతిని కాపాడాలని నా గురువు చెప్పారు.

Also Read: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే

ఇందుకోసం కూడా నా పోరాటం ఉంటుంది. చాలా మంది అఘోరీలు కూడా ఇందుకోసం రావాలని ప్రయత్నిస్తున్నారు. కుంభమేళా తర్వాత వారందరితో కలిసి పోరాడుతాం. నేను హెచ్చరించిన నాటి నుంచి రాష్ట్రంలో ఆరు దేవాలయాలు ధ్వంసం అయ్యాయి. ఇది అడ్డుకోవడానికి రేవంత్ సర్కార్ ఏం చేయడం లేదు. దమ్ముంటే ఆపండి.. ఎవరికోసం ఎదురు చూడకుండా ఆలయాలను మనం అందరం కలిసి కాపాడుకుందాం’ అంటూ సూచించింది.

ఇక ఇటీవల ఆర్టీవీతో మాట్లాడిన అఘోరీ..  సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించనని చెప్పింది. ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ తానుంటానంది. తెలంగాణలో తనను అపే మగాడు ఇంకా పుట్టలేదని, తెలంగాణలో శివ తాండవం జరగబోతుందని తెలిపింది. పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని.. అయితే ఆయన నుంచి తనకు ఎటువంటి సందేశం ఇంకా అందలేదని అఘోరీ చెప్పుకొచ్చింది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు