High Court: మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారమే: బాంబే హైకోర్టు మైనర్ (18ఏళ్లలోపు) భార్య అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారమే అవుతుందని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. భార్యపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది. By B Aravind 15 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్ (18ఏళ్లలోపు) భార్య అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారమే అవుతుందని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలకు చట్టం నుంచి ఎలాంటి రక్షణ ఉండదని చెప్పింది. భార్యపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి మరో న్యాయస్థానం విధించిన పదేళ్ల శిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది. 18 ఏళ్ల లోపు ఉన్న మహిళతో శృంగారంలో పాల్గొనడం అంటే .. ఆమె వివాహం చేసుకుందా ? లేదా ? అన్నదానితో సంబంధం లేకుండా అత్యాచారంగానే పరిగణించాలని తేల్చి చెప్పింది. Also Read: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే ఇక వివరాల్లోకి వెళ్తే.. పెళ్లికి ముందు తనతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకోవడం వల్ల తాను గర్భం దాల్చాల్సి వచ్చిందని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. వాళ్లకి వివాహం అయినప్పటికీ, కొంతకాలం తర్వాత విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆమె తన భర్తపై కోర్టు మెట్లెక్కింది. వాళ్లకి పెళ్లి జరిగినప్పటికీ కూడా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారంలో పాల్గొనడాన్ని కోర్టు అత్యాచారంగానే భావించింది. Also Read : పాములు నిజంగా పగబడతాయా?..అసలు నిజమేంటి? Consensual Sex మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన ఆ బాధితురాలు తండ్రి, సోదరి, నానమ్మతో కలిసి ఉంటోంది. 2019లో ఆమె ఫిర్యాదు చేయడానికి ముందు మూడు నాలుగేళ్లుగా ఆ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఈ క్రమంలో వాళ్ల మధ్య లైంగిక సంబంధం వల్ల ఆమె గర్భం దాల్చింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నప్పటికీ అబార్షన్ తొలగించుకోవాలని అతడు భార్యపై ఒత్తిడి చేశాడు. ఆమెపై భౌతిక దాడికి పాల్పడటమే కాక.. ఆ బిడ్డ వేరే వ్యక్తి వల్ల వచ్చిందనే ఆరోపణలు చేశాడు. Also Read: 50వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు–రిలయెన్స్ దీంతో బాధిత మహిళ 2019లో పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు అరెస్టయ్యాడు. ఆ తర్వాత కేసు కోర్టు వరకు చేరింది. ఆమె అంగీకారంతోనే తాను శృంగారంలో పాల్గొన్నట్లు అతడు చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. పుట్టిన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష చేయించగ.. వీళ్లిద్దరే తల్లిదండ్రులని నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలోనే కింది కోర్టు విధించిన శిక్షను బాంబే హైకోర్టు కూడా సమర్థించింది. Also Read : గుండె పోటు నుంచి తప్పించుకోవాలంటే.. ఈ పనులు చేయండి! #telugu-news #bombay-high-court #national-news #rape మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి