వదిన అక్రమ సంబంధానికి మరదలు బలి.. ఇదో దుర్మార్గపు క్రైమ్ కథ! హైదరాబాద్ కు చెందిన డిగ్రీ విద్యార్థిని స్రవంతి సూసైడ్ కేసును పోలీసులు ఛేధించారు. అన్న భార్య శైలజనే హంతకురాలిగా నిర్ధారించారు. శైలజ అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడితో కలిసి స్రవంతిని వేధింపులకు గురి చేసినట్లు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేశారు. By srinivas 15 Nov 2024 in క్రైం హైదరాబాద్ New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ కు చెందిన డిగ్రీ విద్యార్థిని స్రవంతి సూసైడ్ కేసును పోలీసులు ఛేధించారు. తాను చేయని తప్పుకు అనవసరంగా ప్రాణాలు తీసుకుందని గుర్తించారు. అన్న భార్యనే హంతకురాలిగా నిర్ధారించారు. వదిన శైలజ ఆడిన నాటకం కారణంగానే స్రవంతి అవమానంతో ఉరేసుకుని చనిపోయినట్లు దర్యాప్తుల్లో తేలినట్లు వెల్లడించారు. ఈ దుర్మార్గపు క్రైమ్ కథ వివరాల్లోకి వెళితే.. ఫోన్ లో భయంకర నిజాలు.. హైదరాబాద్ రసూల్‌పురా ఇందిరమ్మనగర్‌కు చెందిన డిగ్రీ చదువుతున్న స్రవంతి (19) నవంబర్ 11న ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. అయితే ప్రియుడి వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ స్రవంతి తండ్రి విఠల్ ఇంటి దగ్గరలోని ఓ యువకుడిపై పోలీసులకు కంప్లైట్ ఇచ్చాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్రవంతి సెల్‌ఫోన్ పరీశీలించగా.. అందులోని మెసేజ్ లు అసలైన నిందితులను పట్టించాయి. యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌లో ఉంటున్న నవీన్‌కుమార్.. స్రవంతిని వేధింపులకు గురిచేసినట్లు గుర్తించి అరెస్ట్ చేసి విచారించగా భయంకర నిజాలు బయటపడ్డాయి. అక్రమ సంబంధం బయటపడుతుందని.. ఈ మేరకు స్రవంతి చావులో అన్న భార్య(వదిన) శైలజ హస్తం ఉన్నట్లు విచారణలో నవీన్ కుమార్ చెప్పాడు. శైలజతో తనకు పెళ్లికి ముందే సంబంధం ఉన్నట్లు అంగీకరించాడు. ఇటీవల శైలజను కలుస్తున్న క్రమంలో స్రవంతి గుర్తించిందని, దీంతో తమ బాగోతం భయటపడుతుందనే భయంతో కొత్త నాటానికి తెరతీశామని తెలిపాడు. స్రవంతికి ఇంటి పక్కనే ఉండే అబ్బాయితో లవ్ రిలేషన్ ఉన్నట్లు క్రియేట్ చేసి శైలజ, తాను వేధింపులకు గురిచేసినట్లు నవీన్ కుమార్ వెల్లడించాడు. వివిధ నెంబర్లనుంచి స్రవంతి ఫోన్‌కు అసభ్యకర మెసేజ్ లు పంపినట్లు అంగీకరించాడు. ఈ క్రమంలోనే వారి వేధింపులు తట్టుకోలేక స్రవంతి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు ఇది కూడా చదవండి: Ambati Rambabu: నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై...! అయితే ఇన్నాళ్లు ప్రేమ వ్యవహారం కారణంగా చనిపోయిందనుకున్న స్రవంతి తల్లిదండ్రులు విషయం తెలియగానే గుండెలు పగిలేలా రోధించారు. కోడలే తన కూతురు ఆత్మహత్యకు కారణమైనట్లు పోలీసుల విచారణలో బయటపడటంతో కంగు తిన్నారు. నిందితురాలు శైలజతో పాటు నవీన్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇది కూడా చదవండి: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్ #hyderabad #girl #sucide మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి