RCB vs Punjab: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన RCB.. ఈ సాలా కప్‌ నమ్‌దే..

ఐపీఎల్‌ క్వాలిఫయర్‌1 లో పంజాబ్‌ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో గెలిచన ఆర్సీబీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌ నిర్దేశించిన 102 పరుగుల లక్ష్యాన్ని 9.5 ఓవర్లలోనే చేజ్‌ చేసింది. 8 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ సాధించింది.

New Update
RCB

RCB

ఐపీఎల్‌ క్వాలిఫయర్‌1 లో పంజాబ్‌ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో గెలిచన ఆర్సీబీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌ నిర్దేశించిన 102 పరుగుల లక్ష్యాన్ని 9.5 ఓవర్లలోనే చేజ్‌ చేసింది. 8 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ సాధించింది. ఓపెనర్‌ సాల్డ్‌ హాఫ్‌ సెంచరీతో చెలరేగిపోయాడు. ఆర్సీబీ ఫైనల్స్‌కు వెళ్లడం ఇది నాలుగోసారి. మొదటగా 2009లో డెక్కన్ ఛార్జర్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత 2016లో SRH చేతిలో ఓడిపోయింది. ఇప్పటివరకు ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్‌ సాధించలేకపోయింది. ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఎప్పటినుంచో తమ టీమ్‌ కప్పు కొట్టాలని కోరుకుంటున్నారు. మరీ ఈ సీజన్‌లో ఆర్సీబీ ఐపీఎల్‌ ట్రోఫీ కొట్టబోతుందా అంటే జూన్ 3 వరకు వేచి చూడాల్సిందే. 

Also Read: ఆపరేషన్ సిందూర్ ఇంకా ఉంది.. పాకిస్తాన్‌లోకి వెళ్లి 3సార్లు దాడులు

మొదటగా ఆర్సీబీ బౌలర్ల ధాటికి 101 పరుగులకే పంజాబ్ కింగ్స్ ఆల్ అవుట్ అయిపోయింది. ఒక్క బ్యాటర్ కూడా 30 కి పైగా పరుగులు చేయలేకపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్‌ శర్మ 3, యశ్‌ దయాల్ 2, హేజిల్‌వుడ్‌ 3 వికెట్లు తీశారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్‌ శర్మ 3, యశ్‌ దయాల్ 2, హేజిల్‌వుడ్‌ 3 వికెట్లు తీశారు. ఇక పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో మార్కస్‌ స్టోయినిస్‌ (26),  ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (18), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (18) ఈ ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. 

Also read: ఎన్నికల్లో తేల్చుకుందాం.. ప్రధాని మోదీకి మమతా బెనర్జీ కౌంటర్

నేహల్‌ వధేరా 8, ప్రియాంశ్‌ ఆర్య 7, జోస్‌ ఇంగ్లిస్‌ 4, శ్రేయస్‌ అయ్యర్‌ 2,  శశాంక్‌ సింగ్‌ 3, హర్ప్రీత్‌ బ్రార్‌ 4, ముషీర్‌ ఖాన్‌ 0 పరుగులకే ఔటైపోయారు. ఈ సీజన్‌లో రెచ్చిపోయి ఆడిన పంజాబ్ హిట్టర్లు ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు. కేవలం 50 పరుగులకే పంజాబ్‌ ఐదు వికెట్లు కోల్పోయింది. 14.1 ఓవర్లలో పంజాబ్‌ కింగ్స్‌ 101 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. చివరికీ ఆర్సీబీ ఈ స్కోర్‌ను 10 ఓవర్లకే ఛేజ్ చేసి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

Punjab Kings | rcb | IPL 2025 | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు