టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు తర్వాత అతడు తన నిర్ణయాన్ని తెలిపాడు. దీంతో చాలా మంది క్రికెట్ ప్రముఖులు షాక్ అయ్యారు. అకస్మాత్తుగా అశ్విన్ రిటైర్మెంట్ తీసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
Also Read: అశ్విన్ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే!
ఈ రోజు నాదైంది..
అయితే తన రిటైర్మెంట్‌పై అశ్విన్ తాజాగా స్పందించాడు. స్కై స్పోర్ట్స్ క్రికెట్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఏ విషయాలను పెద్దగా పట్టించుకోనని.. వాటిని పట్టుకుని సాగతీయనని అన్నాడు. తానెప్పుడూ తన జీవితంలో అభద్రతా భావాన్ని అనుభవించలేదన్నాడు. ‘‘ఈ రోజు నాదైంది.. రేపు నా వద్దే ఉంటుందని నేను నమ్మను’’ అన్నాడు. ఇలాంటి ఆలోచనే ఇన్నాళ్లూ తన ఎదుగుదలకు కారణమైందన్నాడు.
"It is the game that has always stood ahead of me" 🏏
— Sky Sports Cricket (@SkyCricket) December 23, 2024
An incredibly humble reflection of his retirement from Ravi Ashwin 💗 pic.twitter.com/Xj5Od0kw8n
Also Read: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే
అలాగే తన గురించి జనాలు సంబరాలు చేసుకుంటారని కూడా తాను ఎప్పుడూ నమ్మనని అన్నాడు. తాను నిర్మొహమాటంగా ఎన్నో విషయాలను వదిలేస్తానని చెప్పాడు. అంతేకాకుండా భారతదేశంలో కొన్నిసార్లు తనపై లభించే శ్రద్ధను విశ్వసించనని పేర్కొన్నాడు. ఎప్పుడైనా తనకంటే తన ఆటే ఎంతో ముఖ్యమైనదని తెలిపాడు. ఇక రిటైర్మెంట్ గురించి చాలా సార్లు ఆలోచించానని పేర్కొన్నాడు. ఎప్పుడైతే నిద్రలేవగానే తనలోని సృజనాత్మకతకు భవిష్యత్తు లేదనుకుంటే అదేరోజు ఆటను వదిలేస్తానని చెప్పాడు.
Also Read: రైల్వే శాఖలో 32,438 ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే?
ఎందుకో గాని తనకు అదే భావన కలిగిందని.. అందుకే వదిలేశానని చెప్పుకొచ్చాడు. తన ప్రయాణం పూర్తిగా తనదేనని అన్నాడు. విభిన్నమైన స్కిల్స్, టాలెంట్‌తో క్రికెట్‌ను ఆడానన్నారు. క్రియేటివ్ గురించి ఇతరులకు చెప్పగలగడం చాలా ముఖ్యమైనది, ప్రత్యేకమైనదన తెలిపాడు. తాను క్రికెట్‌ను వీడటంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నాడు. క్రికెట్ తనకు చాలా ఇచ్చిందని.. అందువల్ల సంతోషంగ ఉన్నట్లు తెలిపాడు.
Also Read: ఏపీలో ఫ్రీ బస్ పథకం.. 2,000 బస్సులు, 11,500 మంది సిబ్బంది అవసరం!