/rtv/media/media_files/2024/12/24/jaoBYbAoNephfSJa0qUz.jpg)
RRB Group D Recruitment 2025
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడు భారీ ఉద్యోగాల ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు త్వరలోనే శుభవార్త రానుంది. దాదాపు 30 వేలకు పైగా ఖాళీల కోసం రైల్వే శాఖ ప్రకటన రిలీజ్ చేయనుంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేసి రైల్వే శాఖ త్వరలో మరో ఊహంచని ప్రకటన వదలనుంది. డిసెంబర్ 28, 2024న నోటిఫికేషన్ రానుంది.
Also Read: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే!
32,438 ఖాళీల కోసం నోటిఫికేషన్
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) డిసెంబర్ 2024లో దాదాపు 32,438 ఖాళీల కోసం GROUP-D రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు తన rrbcdg.gov.inలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు అందించింది.
Also Read: అవార్డు ఇవ్వమని అడుక్కోవాలా.. ఖేల్ రత్నపై మను తండ్రి ఫైర్
RRB గ్రూప్ -డి రిక్రూట్‌మెంట్ 2025 కోసం పరీక్ష విధానంతో పాటు ఇతర వివరాలను, సమగ్ర గైడ్ కోసం ఈ సైట్‌ను ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దీని ప్రకారం.. 32,438 గ్రూప్ డి పోస్టుల భర్తీకి త్వరలోనే ఆర్ఆర్‌బీ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేనుంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జనవరి 23న ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22, 2025 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
Also Read: సంధ్య థియేటర్ ఘటన.. వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటున్నారు : విజయశాంతి
ఇక 32,438 ఉద్యోగ ఖాళీలలో ట్రాక్ మెయింటైన్ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 13,187 ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే పాయింట్స్ మెన్ 5,058 ఉద్యోగాలు, అసిస్టెంట్ 3,077 ఉద్యోగాలు ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని విభాగాల్లో ఉన్నాయి. ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 ఏళ్ల లోపు ఉండాలి. పదోతరగతి లేదా NCVT నుండి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. అలాగే ఐటీఐ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
Also Read: పీఎఫ్ ఫ్రాడ్ కేసుపై స్పందించిన ఉతప్ప.. సంబంధం లేదంటూ