Punjab Kings: ప్లే ఆఫ్స్‌కు పంజాబ్ !.. చేతులెత్తేసిన రాజస్థాన్

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 10 పరుగుల తేడాతో గెలిచింది. 220 పరుగుల లక్ష్యంతో దిగిన రాజస్థాన్‌.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో పంజాబ్‌ మొత్తానికి ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకున్నట్లే. 

author-image
By B Aravind
New Update
Punjab Kings

Punjab Kings

పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓడిపోయింది. 10 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యంతో దిగిన రాజస్థాన్‌.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. ఆర్‌ఆర్‌ టీమ్‌లో యశస్వి జైశ్వల్ 50, వైభవ్ సూర్యవంశీ 40, ధ్రువ్ జురెల్ 53 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక హర్‌ప్రీత్‌ 3, ఒమర్జాయ్ 2, మార్కో 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో 17 పాయింట్లు సాధించిన పంజాబ్‌ మొత్తానికి ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకున్నట్లే. 

Also Read: జ్యోతిపై పూరీ యూట్యూబర్‌ సంచలన కామెంట్స్.. వెలుగులోకి సంచలన విషయాలు

ఇక పంజాబ్‌ బ్యాటర్లలో నేహాల్‌ వదేరా 70, శశాంక్ సింగ్ 59*, శ్రేయస్ అయ్యార్ 30, ఓమర్జాయ్ 21, ప్రభుసిమ్రాన్ సింగ్‌ 21 పరుగులతో స్కోర్‌ను పరుగులు పెట్టించారు. దీంతో పంజాబ్ ఓ అరుదైన రికార్డును సాధించింది. జైపూర్‌లోని సవాయ్‌ మాన్సింగ్‌ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన టీమ్‌గా నిలిచింది. ఇప్పటిదాకా ఈ రికార్డు ముంబయి ఇండియన్స్‌కు ఉండేది. 

Also Read: పాక్ వ్యక్తితో రిలేషన్.. ఇండియన్ అధికారులకు వలపు వల.. జ్యోతి వ్యవహారంలో సంచలన విషయాలు!

గతంలో ఈ వేదికపై రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి.. 217 పరుగులు చేసింది. తాజాగా పంజాబ్ కింగ్స్‌ 219 పరుగులు చేసి ముంబయి రికార్డును బ్రేక్ చేసింది. అంతేకాదు ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్‌ నంబర్‌ 4 నుంచి 7 వరకు ఎక్కువ రన్స్ చేసిన టీమ్‌గా పంజాబ్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాటర్లు నంబర్ 4 నుంచి 7 వరకు మొత్తం180 పరుగులు చేశారు. 

Also Read: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..

Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి

 IPL 2025 | Rajastan Royals | punjab-kings 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు