PBKS vs LSG: బహుత్ అచ్చా బ్యాటింగ్.. చెలరేగిన శ్రేయస్ సేన.. లక్నో జట్టుకు భారీ టార్గెట్

పంజాబ్ కింగ్స్ VS లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. దీంతో LSG ముందు 237 పరుగుల టార్గెట్ ఉంది.

New Update
Punjab Kings  VS LSG

Punjab Kings

ఐపీఎల్‌ 2025లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ VS లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. దీంతో LSG ముందు 237 పరుగుల టార్గెట్ ఉంది. 

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

ఎవరెన్ని కొట్టారంటే?

పంజాబ్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ 48 బంతుల్లో 91 పరుగులు బాదేశాడు. అందులో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. అతడు త్రుటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. శ్రేయస్ కూడా హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. జోష్ ఇంగ్లిస్ 14 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అందులో 1 ఫోర్, 4 సిక్స్‌లు ఉన్నాయి. 

శశాంక్ సింగ్ 15 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. అందులో 4 ఫోర్లు, 1 సిక్స్‌ ఉంది. స్టాయినిస్ 5 బంతుల్లో 15 పరుగులు చేశాడు. అందులో 1 ఫోర్, 1 సిక్స్‌ ఉంది. నేహల్ వధేరా 9 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అందులో 2 ఫోర్లు, 1 సిక్స్‌ ఉంది. ఇలా ప్రతి ఒక్కరూ లక్నో బౌలర్ల బౌలింగ్‌లో విజృంభించారు. లఖ్‌నవూ బౌలర్లలో ఆకాశ్ మహారాజ్‌ సింగ్ 2 వికెట్లు, దిగ్వేశ్‌ సింగ్ రాఠీ 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. 

Also Read :  కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

telugu-news | latest-telugu-news | PBKS vs LSG
Advertisment
తాజా కథనాలు