IPL 2025: పంజాబ్ కింగ్స్కు బిగ్ షాక్ ... టోర్నమెంట్ నుంచి స్టార్ ఆటగాడు ఔట్!

పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్ 2025 నుండి దూరమయ్యాడు. వేలు ఫ్రాక్చర్ కావడంతో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో అతను ఆడటం లేదు.

New Update
pbks ipl 2025

pbks ipl 2025

పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్ 2025 నుండి దూరమయ్యాడు. వేలు ఫ్రాక్చర్ కావడంతో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో అతను ఆడటం లేదు. ఈ విషయాన్ని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ డాషింగ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్‌ను పంజాబ్ జట్టు మెగా వేలంలో రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్ లో గ్లెన్ మాక్స్‌వెల్ అంతగా ఆకట్టుకోలేదు.

Also Read :  ఆ సమస్యలను పరిష్కరించండి...కేంద్ర మంత్రితో ఎంపీ సానా సతీష్ బాబు భేటీ!

Also Read: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

48 పరుగులు మాత్రమే

ఏడు మ్యాచ్‌ల్లో కేవలం 48 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కూడా తీసుకున్నాడు. అయితే బౌలింగ్ లో మాత్రం మాక్స్‌వెల్ పంజాబ్ కు కీలకంగా మారాడు. డూ-ఆర్-డై మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లను ఔట్ చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. కాగా పంజాబ్ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. చెన్నైపై గెలిస్తే పంజాబ్ రెండవ స్థానానికి వెళ్తుంది.  ఇక చెన్నై ఈ సీజన్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో రెండింటిలో మాత్రమే గెలిచింది. పంజాబ్ పై ఓటమి పాలైతే దాదాపుగా ఐపీఎల్ 2025 పోటీ నుండి తొలగిపోయే అవకాశం ఉంటుంది.  

Also Read: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!

Also Read :  Haryana: ఆ నీరు పాకిస్థాన్‌కు వెళ్లొద్దు.. హర్యానా కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు