Russia-Ukraine: ఉక్రెయిన్‌లో ప్రయాణికుల రైలుపై డ్రోన్లతో దాడి...బాంబుల వర్షం కురిపించిన రష్యా

క్రెయిన్‌-రష్యా యుద్ధం అంతకంతకు ముదురుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలో ఓ రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు డ్రోన్లతో దాడులు చేశాయి. దాడి కారణంగా రైల్లోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి. అని అధికార వర్గాలు వెల్లడించాయి.

New Update
Drones attack passenger train in Ukraine

Drones attack passenger train in Ukraine

Drone Attack On Train : ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం అంతకంతకు ముదురుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలో ఓ రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు డ్రోన్లతో దాడులు చేశాయి. ‘‘సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్‌ దాడులు జరిపింది. అదే సమయంలో కీవ్‌కు వెళ్తోన్న ఓ ప్రయాణికుల రైలుపై బాంబుల వర్షం కురిపించింది. దాడి కారణంగా రైల్లోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి. అని అధికార వర్గాలు వెల్లడించాయి.

కాగా ఈ దాడిలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత, ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రానప్పటికీ  ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 30 మందికి పైగా గాయపడినట్లు ఉక్రెయిన్‌ వర్గాలు చెబుతున్నాయి, సమాచారం. కాగా బోగిలకు నిప్పు అంటుకుని ఎగిసిపడుతోంది. కాగా బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ రష్యాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 ‘‘సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్‌ దాడులు జరిపింది. ఇందులో అనేక మంది గాయపడ్డారు. సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని ఆ దేశ ప్రజలకు బహుశా తెలియకపోవచ్చు. కానీ, ఈ ఉన్మాద ప్రవర్తన పట్ల ప్రపంచం నిర్లక్ష్య ధోరణి వహించకూడదు. ప్రతి రోజూ రష్యా ఎంతో మంది ప్రాణాలు తీస్తోంది. యుద్ధం పరిష్కారం కోసం ఐరోపా, అమెరికా నుంచి ఎన్నో ప్రకటనలు వింటున్నాం. కానీ, మాకు మాటల సాయం సరిపోదు. బలమైన చర్యలు అవసరం’’ అని జెలెన్‌స్కీ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సోషల్ మీడియాలో ధ్రువీకరించారు.

Also Read :  NWR Railways Recruitment 2025 : 10వ తరగతితో రైల్వే ఉద్యోగాలు.. 898 ఖాళీలకు నోటిఫికేషన్

Advertisment
తాజా కథనాలు