CAA : ఎన్నికల వేళ హోంశాఖ కీలక నిర్ణయం..14 మందికి భారత పౌరసత్వం మంజూరు!
దేశంలో ఎన్నికల వేళ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద 14 మంది వ్యక్తులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసింది. పౌరసత్వ ధ్రువీకరణ సర్టిఫికెట్ మొదటి సెట్‌ను బుధవారం అధికారికంగా జారీ చేసింది.