/rtv/media/media_files/2025/09/18/pak-team-2025-09-18-09-10-48.jpg)
టీమ్ ఇండియా(team-india) తో మరోసారి ఓడిపోవడంతో పాకిస్తాన్ జట్టు(pakistan-team) తలెత్తుకోలేకుండా అయిపోయింది. ఆ జట్టుకు భారత్ చేతిలో ఓడిపోవడం వరుసగా ఇది ఏడవసారి. మ్యాచ్ ముందు ప్రతీసారి ప్రగల్భాలు పలుకుతారు కానీ... ఆటలో మాత్రం తేలిపోతారు. ఆసియా కప్ టోర్నీలో కూడా ఇదే జరిగింది. లీగ్ దశలో మ్యాచ్ లో అయితే అసలేమీ పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసింది పాక్ టీమ్. సూపర్-4 మ్యాచ్ లో కాస్త పర్వాలేదనిపించినా..భారత బ్యాటర్ల ధాటికి ఓటమి తప్పలేదు. పాక్ పరాజయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ దేశ మాజీలందరూ విరుచుకుపడుతున్నారు.
Also Read : ఆర్మీచీఫ్, పీసీబీ చీఫ్ రావాల్సిందే..పాక్ జట్టుపై ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు..
అంతా వాళ్ళిద్దరే చేశారు..
అంతేకాదు ఇండియాతో మ్యాచ్ ఓటమి తర్వాత పాక్ జట్టులో విభేదాలు కూడా తలెత్తాయని తెలుస్తోంది. కెప్టెన్ సల్మాన్, షాహిన్ అఫ్రిదీ వల్లనే మ్యాచ్ ఓడిపోయారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇద్దరూ చాలా చెత్త ప్రదర్శన చేస్తున్నారని అంటుననారు. గడిచిన నాలుగు మ్యాచ్లలో కెప్టెన్ కేవలం 40 పరుగుల మాత్రమే చేయడం విమర్శలకు దారి తీస్తోంది. మరోవైపు షాహీన్ ఆఫ్రీది కూడా ఇండియాతో మ్యాచులో భారీగా రన్స్ సమర్పించుకున్నాడు. అసలే ఇండియాతో జరిగిన 2 మ్యాచుల్లో ఓడడంతో అవమాన భారంలో వెళ్ళిపోయిన పాకిస్తాన్ ప్లేయర్లు..సల్మాన్, ఆఫ్రీదీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. దానికి తోడు మాజీలు కూడా తిడుతుండడంతో మోహం చూపించలేకపోతున్నారని అంటున్నారు. ఇక ఈరోజు పాకిస్తాన్ టీమ్ శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఆ జట్టు సెమీస్ కు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే మూటాముల్లె జర్దుకుని ఎంచక్కా వారి దేశానికి వెళ్ళిపోవచ్చును.
మరోవైపు పాకిస్తాన్ జట్టుపై ప్రస్తుతం స్వంత దేశంలోనే విమర్శలతో దాడి చేస్తున్నారు. రెండు సార్లు భారత్ చేతిలో ఓడిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అయితే వరుస విమర్శలతో దాడి చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ ప్రధాని, ఆ దేశ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్(imran-khan) సైతం జట్టుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత్ పై గెలవాలంటే ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీలను ఓపెనర్లుగా పంపాలని ఆ దేశ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఎగతాళి చేశారు. దాంతో పాటూ అంపైర్లుగా న్యాయవ్యవస్థ పెద్దలను పెట్టాలని అన్నారు. మాజీ పాక్ చీఫ్ జస్టిస్ ఖాజీ ఫైజ్ ఇసా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రాజా ఆన్ - ఫీల్డ్ అంపైర్లుగా, ఇక ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సర్ఫరాజ్ డోగర్ థర్డ్ అంపైర్ గా ఉండాలని వెటకారం చేశారు.
Also Read : క్యాబ్ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ.. మళ్ళీ ఆరేళ్ళ తర్వాత