Pakistan Record: 136 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన పాకిస్థాన్

పాకిస్థాన్ క్రికెట్ జట్టు 136 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. ఫాలో ఆన్ ఆడిలో అత్యధిక పరుగులు చేసిన మొదటి జట్టుగా పాకిస్థాన్ రికార్డు సృష్టించింది. గతంలో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా 327/7 పరుగులు చేయగా, పాకిస్థాన్ 478/10 చేసింది.

New Update
Pakistan

Pakistan Photograph: (Pakistan)

పాకిస్థాన్ క్రికెట్ జట్టు వందల ఏళ్ల క్రితం ఉన్న రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. ఫాలో ఆన్ ఆడిలో అత్యధిక పరుగులు చేసిన మొదటి జట్టుగా పాకిస్థాన్ రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాలో ఓ విజిటింగ్ టీమ్‌తో ఫాలో ఆన్ ఆడి 400 కంటే ఎక్కువ పరుగులు చేసింది. గత 136 ఏళ్లలో ఇన్ని పరుగులు చేయడం ఇదే తొలిసారి.

ఇది కూడా చూడండి: Makara Sankranti: సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా..దాని వెనుక ఉన్న కథేంటంటే!

ఇది కూడా చూడండి: అస్సాం బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి

136 ఏళ్ల రికార్డును బ్రేక్..

1902లో దక్షిణాఫ్రికాలో జోహన్నెస్ బర్గ్ వేదికగా ఆస్ట్రేలియా (Australia) ఫాలో ఆన్ ఆడి 327/7 పరుగులు చేసింది. అదే రికార్డు ఇప్పటికీ ఉండగా.. తాజాగా పాకిస్థాన్ (Pakistan) దాన్ని బ్రేక్ చేసింది. 478/10 పరుగులు చేసి 136 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా తర్వాత  వెస్టిండీస్ (348/10), న్యూజిలాండ్ (342/10), శ్రీలంక (342/10) జట్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి పాలయ్యింది. కానీ రికార్డును బ్రేక్ చేసింది. 

ఇది కూడా చూడండి:  ప్లీజ్.. ఆ వీడియోను తొలిగించండి :  కోర్టు మెట్లెక్కిన రమ్య

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లోనే 194 పరుగులకు ఆలౌటైంది. కానీ ఫాలో ఆన్ ఆడిలో మాత్రం పాకిస్థాన్ 478 పరుగుల స్కోర్ చేసి రికార్డు సృష్టించింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు