IND Vs PAK: టీ20 ప్రపంచ కప్.. దిగొచ్చిన పాకిస్తాన్

బంగ్లాదేశ్‌కు మద్ధతుగా పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పట్టు పట్టింది. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి పీసీబీ, అంతర్జాతీయ క్రికెట్ మండలి మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరగ్గా చివరకు భారత్‌తో మ్యాచ్ ఆడటానికి ఒప్పుకుంది.

New Update
ind vs pak

ind vs pak

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై సందిగ్ధత ఎట్టకేలకు తొలగిపోయింది. బంగ్లాదేశ్‌కు మద్ధతుగా పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పట్టు పట్టింది. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, అంతర్జాతీయ క్రికెట్ మండలి మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరగ్గా చివరకు భారత్‌తో మ్యాచ్ ఆడటానికి ఒప్పుకుంది. పాకిస్థాన్ తన మొండి వైఖరిని వీడటానికి ప్రధాన కారణం మిత్ర దేశాల నుండి వచ్చిన విజ్ఞప్తులే. శ్రీలంక, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డులు భారత్‌తో మ్యాచ్ ఆడాలని పీసీబీని కోరాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమినుల్ ఇస్లామ్ పాక్ జట్టు పాల్గొనడం క్రీడకు ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. అంతేకాకుండా.. శ్రీలంక ప్రధాని అనుర కుమార స్వయంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించడంతో ఒప్పుకుంది.

ఇది కూడా చూడండి: Malreddy Ranga Reddy : మంత్రి పదవి కోసం రాజీనామా చేస్తా..ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇది కూడా చూడండి: పశ్చిమ బెంగాల్‌ SIR ప్రక్రియను పొడిగించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఐసీసీ తిరస్కరించడంతో..

పాకిస్థాన్, భారత్, బంగ్లాదేశ్‌లతో సిరీస్‌ను నిర్వహించాలన్న పీసీబీ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. అలాగే భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ పునరుద్ధరణ అనేది రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ఉన్న విషయమని.. ఇందులో తమ జోక్యం ఉండదని ఐసీసీ స్పష్టం చేసింది. అయితే బంగ్లాదేశ్‌కు జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ రాబోయే అండర్-19 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను ఆ దేశానికి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. 

ఇది కూడా చూడండి: రూ.54 వేల కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

టీ20 ప్రపంచకప్‌లో పాల్గొననందుకు బంగ్లాదేశ్‌పై ఎటువంటి కఠిన ఆంక్షలు విధించబోమని ఐసీసీ భరోసా ఇచ్చింది. ఈ నెల 15వ తేదీన కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. షెడ్యూలు మార్పు లేకుండా పాత పద్ధతిలోనే మ్యాచ్ నిర్వహించనున్నారు. పాక్ జట్టు అనుమతి లభించడంతో కొలంబోలో టికెట్ల అమ్మకాలు వేగవంతమయ్యాయి. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ మ్యాచ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు