ప్లీజ్ మా దేశానికి రండి.. భారత్ ఆటగాళ్లకు పాక్ కెప్టెన్ రిక్వెస్ట్! ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తమ దేశం రావాలంటూ భారత ఆటగాళ్లను పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ రిక్వెస్ట్ చేశాడు. ‘సూర్య, రాహుల్ మా దేశానికి రండి. భారత జట్టుకు స్వాగతం పలికేందుకు మేము, బోర్డ్ సిద్ధంగా ఉన్నాం' అంటూ విజ్ఞప్తి చేశాడు. By srinivas 13 Nov 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడేందుకు భారత ఆటగాళ్లు తమ దేశం రావాలంటూ పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ రిక్వెస్ట్ చేశాడు. భారత ఆటగాళ్లకు తాము ఘనంగా స్వాగతం పలికేందుకు సింద్ధంగా ఉన్నామని చెప్పాడు. ఇది కేవలం ఆటగాళ్ల కోరిక మాత్రమే కాదని, పీసీబీ బోర్డ్ కూడా తమ రాకను స్వాగతిస్తుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. Also Read : 'స్పిరిట్' 6 నెలల గ్యాప్ లోనే పూర్తి చేస్తాం.. రిలీజ్ అప్పుడే: నిర్మాత Mohammad Rizwan "a welcome to KL Rahul, Suryakumar Yadav and all the others who come to Pakistan" #CT2025 #Cricket pic.twitter.com/hAcFCiRyrX — Saj Sadiq (@SajSadiqCricket) November 13, 2024 Also Read : ఏమి యాక్టింగ్ బాబు.. ఎన్టీఆర్‌ని మించిపోయింది: జగన్ సంచలన వ్యాఖ్యలు మీ ఘన స్వాగతం పలుకుతాం.. ఈ మేరకు ఛాంపియన్స్ ట్రోపీ రద్దు కాబోతుందనే వార్తలపై బుధవారం మీడియాతో మాట్లాడిన రిజ్వాన్.. ‘సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ మా దేశానికి రండి. మీ అందరికీ స్వాగతం పలుకుతాం. ఇది మా నిర్ణయం కాదు.. పీసీబీ తీసుకున్న నిర్ణయం. మీరంతా చర్చించి దీనిపై సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ‘మీరు పాకిస్థాన్‌కు ఎందుకు రావడం లేదో చెప్పండి’ అంటూ పాక్ అభిమాని ప్రశ్నించగా.. ‘బ్రదర్.. ఇది ఆటగాళ్ల చేతుల్లో లేదు’ అంటూ సూర్య రిప్లై ఇవ్వడం విశేషం. కాగా పాక్ ఆటగాళ్ల విజ్ఞప్తిపై పలువురు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: KTR ఆదేశాలతోనే కలెక్టర్‌పై దాడి!.. రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు! ఇక 2025 ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరిగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యమివ్వనుండగా.. భారత్ అక్కడికి రాలేమని స్పష్టం చేసింది. దీంతో హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించాలని పీసీబీకి ఐసీసీ సూచించింది. పాక్ బోర్డు అందుకు అంగీకరించట్లేదు. ఉగ్రవాదులకు పాక్ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందనే ఆరోపణలతో 2008 నుంచి భారత జట్టును పాక్ పంపించట్లేదు బీసీసీఐ. ఇది కూడా చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' ఫస్ట్ సింగిల్.. వెంకీ మామ కోసం రమణ గోగుల పాట #pakistan #india #muhammad-rizwan #asian-champions-trophy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి