'స్పిరిట్' 6 నెలల గ్యాప్ లోనే పూర్తి చేస్తాం.. రిలీజ్ అప్పుడే: నిర్మాత

నిర్మాత భూషణ్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'స్పిరిట్‌' షూటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్‌లో పూజా కార్యక్రమాలు ఉంటాయి. రెగ్యులర్ షూటింగ్ 2025 జనవరి నుంచి షురూ కానుంది. 6 నెలల గ్యాప్‌లోనే షూటింగ్ పూర్తి చేసి, 2026 ప్రథమార్థంలో విడుదల చేస్తామని అన్నారు.

New Update
sdfs

భాస్ ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీలో నటించబోతున్నాడు. యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీని మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాడు. ఇందులో ప్రభాస్‌ను ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూడని విధంగా చూపించబోతున్నారు.  

ఈ సినిమా అప్టేడ్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో నిర్మాత భూషణ్ కుమార్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ..' స్పిరిట్‌ సినిమా పూజా కార్యక్రమం డిసెంబర్‌లో ఉండబోతుంది. 

Also Read : 'సంక్రాంతికి వస్తున్నాం' ఫస్ట్ సింగిల్.. వెంకీ మామ కోసం రమణ గోగుల పాట

2026 లో రిలీజ్..

సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్క్రిప్ట్‌ రైటింగ్‌తోపాటు మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి పాటలు సిద్దం చేసే పనిలో ఉన్నాడు. స్పిరిట్‌ పూర్తిగా కాప్‌ డ్రామా నేపథ్యంలో ఉండబోతుంది. రెగ్యులర్ షూటింగ్ 2025 జనవరి నుంచి షురూ కానుంది. త్వరలోనే దీని గురించి ప్రకటిస్తాం. అంతేకాదు కేవలం 6 నెలల గ్యాప్‌లోనే స్పిరిట్‌ షూట్‌ పూర్తి చేస్తాం. 2026 ప్రథమార్థంలో విడుదల చేస్తాం..' అని చెప్పుకొచ్చారు. 

ఆయన కామెంట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారను ఫైనల్ చేశారట. ఇప్పటికే ఆమెకు స్క్రిప్ట్ కూడా వినిపించాడట డైరెక్టర్. స్క్రిప్ట్ నచ్చి నయన్ కూడా ప్రభాస్ తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానున్నట్లు తెలుస్తోంది.

Also Read :  ఫస్టాఫ్ అద్భుతం,సెకండాఫ్ అంతకు మించి.. రష్మిక పోస్ట్ వైరల్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు