/rtv/media/media_files/2024/11/13/h9kOMlFlSqf3FwcCvAZ9.jpg)
Lagacharla: కేటీఆర్ ఆదేశాలతోనే లగచర్లలో ప్రభుత్వ అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డట్లు పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పట్నం నరేందర్ ఒప్పుకున్నారు. కేటీఆర్, ఇతర నాయకుల సూచనల మేరకే రాజకీయ మైలేజీ పొందడంతోపాటు తెలంగాణ ప్రభుత్వం పరువు తీయడానికి ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలిపారు. అంతేగాక నిందితుడు సురేష్ తనకు నిరంతరం ఫోన్ చేసి దాడికి ప్లాన్ చేశాడని పట్నం సంచలన విషయాలు బయటపెట్టాడు. దీంతో నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్ లోని కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది.