IMLT20: క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. టీమిండియా కెప్టెన్‌గా లెజెండరీ క్రికెటర్

గతేడాది ప్రారంభం కావాల్సిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్-2025 ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఐఎమ్‌ఎల్ టోర్నీకి కెప్టెన్‌గా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యవహరించనున్నారు. ఆరు జట్లు పాల్గొననున్న ఈ లీగ్‌లో రిటైర్ అయిన క్రికెటర్లు ఆడనున్నారు.

New Update
IMLT20

IMLT20

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్-2025 వచ్చేస్తుంది. గతేడాది ప్రారంభం కావాల్సిన ఈ ఐఎమ్‌ఎల్ టోర్నీ ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభం కానుంది. మూడు వేదికలపై జరగనున్న ఈ లీగ్ ఫైనల్‌ మార్చి 16న జరగనుంది. అయితే ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. భారతదేశం, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఆడనున్నాయి. అయితే ఈ లీగ్‌లో రిటైర్‌ అయిన క్రికెటర్లు కూడా పాల్గొంటారు.

ఇది కూడా చూడండి: ఖేల్ రత్న అవార్డ్‌లు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

రిటైర్ క్రికెటర్లు కూడా..

టీమిండియా జట్టుకు సచిన్ టెండుల్కర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. దీంతో సచిన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. మళ్లీ స్టేడియంలో సచిన్ బ్యాటింగ్ చూస్తామని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియా జట్టుకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికా జట్టుకు జాక్వెస్ కలిస్, వెస్టిండీస్ జట్టుకు బ్రియన్ లారా, శ్రీలంక జట్టుకు కుమార్ సంగక్కర, ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్‌లు కెప్టెన్‌గా ఉండనున్నారు. 

ఇది కూడా చూడండి: Arvind Kejriwal: ప్రధానిమోదీకి కేజ్రీవాల్ సంచలన లేఖ.. ఏం చెప్పారంటే ?

ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్ ను పొడిచిన కత్తి ఇదే.. ఎంత లోతు దిగిందంటే?

ఇది కూడా చూడండి: Imran Khan: పాకిస్థాన్​ మాజీ ప్రధాని​కి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష

Advertisment
తాజా కథనాలు