Saif Ali Khan: సైఫ్ ను పొడిచిన కత్తి ఇదే.. ఎంత లోతు దిగిందంటే?

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దుండగుడు సైఫ్ ను వెన్నులో పొడిచిన కత్తిని డాక్టర్లు ఇవ్వాళ మీడియాకు చూపించారు. ఆ ఫొటో కాస్త వైరల్ అయింది. సుమారు 2.5 అంగుళాల పొడవైన కత్తి సైఫ్ వెన్నుముకలో దిగిందని తెలిపారు

New Update
saif ali khan attack

saif ali khan

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై నిన్న ఉదయం దాడి జరిగిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున ముంబై బాంద్రాలో ఉన్న సైఫ్ నివాసంలో ఓ దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అయితే, ఆ సమయంలో సైఫ్ మేల్కొని అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా, దొంగ కత్తితో దాడి చేసి సైఫ్‌ను గాయపరిచాడు. ఈ దాడిలో సైఫ్ మెడ, వెన్నెముకతో పాటు శరీరంపై ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. 

Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

వెంటనే సైఫ్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రిని హాస్పిటల్ కి తరలించాడు. సైఫ్ కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, వెన్నుముక భాగంలో పొడవడంతో అందులో ఉండే ద్రవం బయటకు వచ్చింది. అందులో ఉన్న కత్తిని బయటకు తీసి  గాయాన్ని సరి చేశామని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అలాగే అతని మెడ, చేతులపై ప్లాస్టిక్ సర్జరీలను నిర్వహించామని తెలిపారు.

అయితే దుండగుడు సైఫ్ ను వెన్నులో పొడిచిన కత్తిని డాక్టర్లు ఇవ్వాళ మీడియాకు చూపించారు. ఆ ఫొటో కాస్త వైరల్ అయింది. ఫొటోలో కత్తి కాస్త పెద్దదిగానే కనిపిస్తోంది. సుమారు 2.5 అంగుళాల పొడవైన కత్తి సైఫ్ వెన్నుముకలో దిగిందని, ఇంకో అంగుళం లోతుగా దిగుంటే ఆయన పరిస్థితి మరింత విషమంగా మారేదని డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు సైఫ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ మేరకు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అందులో..' సైఫ్‌ అలీఖాన్‌ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం మాట్లాడగలుగుతున్నారు, అలాగే నడవగలుగుతున్నారు. నడుస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పి లేదా ఇతర ఇబ్బందులు ఇప్పటివరకు కనిపించలేదు. త్వరలోనే ఆయన్ని ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

వెన్నెముక వద్ద కూరుకుపోయిన కత్తిని విజయవంతంగా తొలగించాం. అయితే గాయాల వల్ల ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉన్నందున, ఆయనకు కొంతకాలం పూర్తిగా విశ్రాంతి అవసరమని సూచించాం. మరికొన్ని రోజుల పాటు పరిస్థితిని పర్యవేక్షించి, డిశ్చార్జ్‌ చేస్తాం..' అని వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు