Jasprit Bumrah: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. IPL మ్యాచ్‌లకు బుమ్రా దూరం!

IPL 2025 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో MI ఫ్యాన్స్‌కు గట్టి షాక్ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరపున మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెన్ను నొప్పి కారణంగా అతడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు సమాచారం.

New Update
Jasprit Bumrah set to miss first few games of IPL 2025..

Jasprit Bumrah set to miss first few games of IPL 2025

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. దీని కోసం ఆయా జట్లు సిద్ధంగా ఉన్నాయి. అభిమానులు సైతం తమ ఫ్యాన్సీ జట్ల మ్యాచ్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్ ఫ్యాన్స్‌కు షాక్ తగిలింది. రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరపున మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. 

Also Read :  పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!

వెన్ను నొప్పితో దూరం

ఈ ఏడాది జనవరిలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) లో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదవ టెస్ట్ సందర్భంగా వెన్ను గాయంతో బాధపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్‌లో రెండవ రోజు అతను ఈ గాయంతో తీవ్ర నొప్పిని ఎదుర్కొన్నాడు. అప్పటి నుండి బూమ్రా పలు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే బుమ్రా తన గాయం నుండి కోలుకుంటున్నాడు.

అందుతున్న సమాచారం ప్రకారం.. బుమ్రా ఏప్రిల్ మొదటి వారంలో ముంబై జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే దాని కంటే ముందు అతడు క్రికెటర్ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వైద్యుల అనుమతి తర్వాత మాత్రమే అతను IPL లో పాల్గొనగలుగుతాడు. 

Also Read :  ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

కాగా ముంబై మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో ప్రారంభ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత మార్చి 29న గుజరాత్ టైటాన్స్, మార్చి 31న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో స్వదేశంలో ఆడనుంది. బుమ్రా ఈ మ్యాచ్‌లను కోల్పోయే అవకాశం ఉంది.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు