Shubman Gill: టీమిండియాకు కొత్త కెప్టెన్.. సెకండ్ టెస్ట్‌కు గిల్ దూరం..!

భారత్, దక్షిణాఫ్రికా మధ్య కోల్‌కతాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మెడ గాయంతో బాధపడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక బంతిని ఎదుర్కొన్న తర్వాత గిల్ మెడనొప్పి గాయం కారణంగా రిటైర్ అయ్యాడు.

New Update
Shubman Gill out of 2nd test against south africa

Shubman Gill out of 2nd test against south africa

భారత్, దక్షిణాఫ్రికా మధ్య కోల్‌కతాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మెడ గాయంతో బాధపడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక బంతిని ఎదుర్కొన్న తర్వాత గిల్ మెడనొప్పి గాయం కారణంగా రిటైర్ అయ్యాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌లో అతడు అస్సలు బ్యాటింగ్ చేయలేకపోయాడు. గాయం ఎక్కువ కావడంతో వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. 

Shubman Gill out of 2nd test

అయితే ఇప్పుడు గిల్ పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అతడు హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ అతడి ఫిట్‌నెస్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. శుభ్‌మాన్ విషయంలో రాబోయే 24 గంటల్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా శుభ్‌మాన్ గిల్ దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండవ టెస్ట్‌లో ఆడగలడా లేదా అనేది ప్రస్తుతం చెప్పడం కష్టమని.. తదుపరి మెడికల్ స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పరిస్థితి మరింత స్పష్టంగా తెలుస్తుందని వర్గాలు పేర్కొన్నాయి. 

ఆ రిపోర్టు బట్టి అవసరమైతే గిల్‌కు పూర్తి విశ్రాంతి, కోలుకునే సమయం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ శుభ్‌మాన్ గిల్ రెండవ టెస్ట్ మ్యాచ్‌కు దూరమైతే.. అతడి స్థానంలో రిషబ్ పంత్ భారత జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడు. కోల్‌కతా టెస్ట్‌లో శుభ్‌మాన్ గిల్ లేనప్పటికీ రిషబ్ పంత్ స్టాండింగ్ కెప్టెన్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.

అదే సమయంలో గిల్ సెకండ్ టెస్ట్ మ్యాచ్‌కు దూరమైతే.. అతని స్థానంలో నాలుగో స్థానంలో ఎవరు ఉంటారు? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఈ క్రమంలో గిల్ స్థానంలో.. సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. గౌహతిలో జరగబోయే సెకండ్ టెస్ట్‌లో వీరిద్దరిలో ఎవరినైనా నాలుగో స్థానంలో తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

సాయి సుదర్శన్ ఐదు టెస్టుల్లో 30.33 సగటుతో 273 పరుగులు చేశాడు. వాటిలో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు పాడిక్కల్ మూడు ఇన్నింగ్స్‌లలో 30.00 సగటుతో 90 పరుగులు చేశాడు. అందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. ఇలా సాయి సుదర్శన్, దేవదత్ పాడిక్కల్ దాదాపు ఒకేలాంటి టెస్ట్ రికార్డులను కలిగి ఉన్నారు. కాగా ఈ సిరీస్‌లోని రెండవ, చివరి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22 నుండి గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

Advertisment
తాజా కథనాలు