Umpire: బాల్ టాంపరింగ్‌ కు పాల్పడిన భారత కీపర్. అంపైర్ తో వాగ్వాదం!

భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ పై అంపైర్ బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. భారత్, ఆస్ట్రేలియా A జట్ల మధ్య అనధికారిక తొలి టెస్టులో ఇషాన్ బాల్ స్క్రాచ్‌ చేశాడంటూ అంపైర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇది మూర్ఖత్వం అంటూ ఇషాన్ ఫైర్ అయ్యాడు. 

New Update
dder

Ishan Kishan : భారత స్టార్ బ్యాటర్, కీపర్ ఇషాన్ కిషన్ పై అంపైర్ బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. భారత్ A, ఆస్ట్రేలియా A జట్ల మధ్య అనధికారిక తొలి టెస్టులో ఇషాన్, అంపైర్ మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ మేరకు నాలుగో రోజు ఆటలో బంతిని మార్చేందుకు అంపైర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఇషాన్‌ తప్పుబట్టాడు. గ్రౌండ్ లోనే అంపైర్‌పై ఇషాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అంపైర్ సైతం ఇషాన్ ను దూషించిన వ్యాఖ్యలు స్టంప్స్‌ మైక్స్‌లో రికార్డు అయ్యాయి.

ఇది కూడా చదవండి: మాకు అన్యాయం చేయొద్దు.. TGPSC ఛైర్మెన్ కు group-1 అభ్యర్థుల కీలక వినతి

అసలేం జరిగిందంటే..

 నాలుగో రోజు ఆటలో ఇషాన్ కిషన్ బంతిపై ఏదో రుద్దినట్లు కనిపించడంతో భారత ఆటగాళ్లపై అంపైర్ క్రెయిగ్ సీరియస్ అయ్యాడు. వెంటనే బాల్ చేంజ్ చేశాడు. దీంతో బంతి మార్పుపై భారత ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. 'మీరేమి చర్చించవద్దు. వెళ్లి ఆడండి. ఇదేమి మీటింగ్ కాదు' అంటూ దురుసగా వ్యవహరించాడు. దీంతో ‘మేము ఇదే బాల్ తో ఆడాలా? మీరు అత్యంత మూర్ఖత్వంగా వ్యవహిరిస్తున్నారు' అంటూ ఇషాన్ ఫైర్ అయ్యాడు. దీంతో మరోసారి రెచ్చిపోయిన అంపైర్.. ‘మీ వల్లే బాల్ చెడిపోయింది. నువ్వే స్క్రాచ్‌ చేశావు. అందుకే మార్చాను. మీ చర్యల వల్లే ఈ మార్పు’ అంటూ అంపైర్ అన్నాడు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ కస్టమర్‌ను చీట్ చేసిన స్విగ్గీ.. జరిమానా ఎంతో తెలుసా!?

అయితే ప్రస్తుతం ఈ వివాదంపై ఇరుబోర్డులు ఇంకా స్పందిచలేదు. బాల్ టాంపరింగ్ అరోపణలు నిజమైతే ఇషాన్ కిషన్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ టెస్టులో భారత్‌ ఓటమి ఎదురైంది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 225 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ కేవలం 3 వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. 

Also Read :  హౌస్ నుంచి క్రై బేబీ అవుట్.. నాలుగు వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

Also Read :  కులమే కాదు.. ఆస్తి, అప్పులతో పాటు ఆ 75 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే

Advertisment
Advertisment
తాజా కథనాలు