Bigg Boss: హౌస్ నుంచి క్రై బేబీ అవుట్.. నాలుగు వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

వైల్ట్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. వారానికి ఈమె రూ.1,50,000 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే నాలుగు వారాలకు కేవలం రూ.6 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Nayani Pavani

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీలు వచ్చిన తర్వాత సీజన్ చూడాలనే ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ 9వ వారం గౌతమ్, తేజ, యష్మీ, హరితేజ, నయని పావని నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ వారం హౌస్ నుంచి క్రై బేబీ నయని పావని ఔట్ అయినట్లు తెలుస్తోంది. ఓటింగ్‌లో ఈమె లీస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి:  ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

నాలుగు వారాలకు ఎంతంటే?

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన నయని పావని హౌస్‌లో నాలుగు వారాలే ఉంది. వారానికి రూ.1,50,000 తీసుకున్నట్లు సమాచారం. అంటే దాదాపుగా రోజుకి రూ.21,428 అన్నమాట. ఇలా చూస్తే నాలుగు వారాలకు కేవలం రూ.6 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు నాలుగు వారాలకి ఈ రెమ్యునరేషన్ ఎక్కువని, మరికొందరు తక్కువని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

ఈసారి వచ్చిన అవకాశాన్ని అయిన సద్వినియోగం చేసుకోవాలని భావించి నయని పావని హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోతుంది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం, కారణం లేని విషయాలకి కూడా గొడవ పెట్టుకుని ఏడవడం చేస్తోంది. ఈ వారం మొత్తం మీద చూసుకుంటే.. ఆటలో గెలిచింది లేదు. ప్రతీ దానికి గొడవ, ఏడుపే కనిపిస్తుంది. ఇది ప్రేక్షకులకు నచ్చక ఓట్లు వేయనట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ

గత సీజన్‌లో కూడా నయని పావని వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు వచ్చిన మొదటి వారమే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సీజన్‌లో కూడా మొదటి వారం నామినేషన్‌లో ఉండాల్సిందే. కానీ గత సీజన్‌లో జరిగినట్లు అవుతుందేమోనని రాయల్ క్లాన్ సభ్యులు అందరూ కలిసి ఆమె నామినేట్ కాకుండా షీల్డ్ ఉపయోగించారు.

ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు