మాకు అన్యాయం చేయొద్దు.. TGPSC ఛైర్మెన్ కు group-1 అభ్యర్థుల కీలక వినతి తెలంగాణ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి మరో అంశం చర్చనీయాంశమైంది. తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాసిన అభ్యర్థులు భాషా ప్రాతిపదికన కాకుండా విషయ విశ్లేషణ ఆధారంగా మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని కోరుతున్నారు. తమకు అన్యాయం జరగకుండా చూడాలని వినతిపత్రం అందించారు. By srinivas 03 Nov 2024 in జాబ్స్ హైదరాబాద్ New Update షేర్ చేయండి TGPSC: తెలంగాణ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి మరో కొత్త సమస్య తెరమీదకొచ్చింది. వరుస వాయిదాలు, వివాదాల తర్వాత అక్టోబర్ 21 నుంచి 27 వరకూ మెయిన్స్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. కాగా తెలుగు మాధ్యమంలో గ్రూప్-1 మెయిన్స్ రాసిన అభ్యర్థులు తమకు అన్యాయం జరగకుండా చూడాలని టీజీపీఎస్సీని కోరుతున్నారు. భాషా ప్రాతిపదికన కాకుండా విషయ విశ్లేషణ ఆధారంగా మూల్యాంకనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కూడా చదవండి: మహిళా డాక్టర్ కు బైకర్ వేధింపులు.. శృంగార వీడియోలు పంపిస్తూ! 80-90శాతం మంది ఇంగ్లీష్ విద్యార్థులే.. ఈ మేరకు టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్‌రెడ్డికి గ్రూప్-1 అభ్యర్థులు వినతిపత్రం సమర్పించారు. గ్రామాలు, పల్లెలనుంచి వచ్చి పరీక్ష రాసిన తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించి పేపర్ల మూల్యాంకనం కీ తెలుగులో ఇవ్వాలని కోరారు. ఇందుకు సంబంధించి స్పష్టమైన సూచనలు చేయాలని రిక్వెస్ట్ చేశారు. 2011 గ్రూప్-1 ఫలితాల్లో 80-90శాతం మంది ఇంగ్లీష్ విద్యార్థులే ఎంపికయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగు మీడియం, ఇంగ్లిష్ మీడియం పేపర్లను వేరు వేరుగా దిద్దించి, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దీనిపై బోర్డు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇది కూడా చదవండి: TG RTC:టీజీఆర్టీసీ గుడ్ న్యూస్..ఆ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు ఇక మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. కాగా మెయిన్స్ కు 67.17శాతం హాజరు నమోదైంది. ఏడు పేపర్లకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 563 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించారు. #tgpsc #group-1 #mains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి