/rtv/media/media_files/2025/05/17/Ga76pcH1nn77DAHNf5Eb.jpg)
rcb-vs-kkr
వారం రోజుల విరామం తర్వాత IPL 2025 తిరిగి ప్రారంభం కాబోతుంది. 2025 మే 17 శనివారం రోజున కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య మ్యాచ్ జరుగబోతుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే సరికొత్త రికార్డు లిఖించబోతుంది. అదేంటంటే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కు చేరిన తొలి జట్టుగా నిలువనుంది. ఒకవేళ బెంగళూరులో వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే కూడా ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఒక్క సీజన్ లోనూ ఆర్సీబీ ఖాతాలో ఈ రికార్డు లేదు.
Also Read : టర్కీకి ఓవైసీ సీరియస్ వార్నింగ్.. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ.. !
Weather Update from Chinnaswamy Stadium 🚨
— Vinod Kumar (@we_knowd) May 17, 2025
Heavy Rain predicted in today's Match between RCB vs KKR at Chinnaswamy. 🌧️ pic.twitter.com/CH87loyZm5
Also Read : పాకిస్థాన్ స్పైగా ఇండియన్ యూట్యూబర్.. మొత్తం ఆరుగురు అరెస్ట్! ఆ రాష్ట్రాల్లో వీరి నెట్ వర్క్
కోల్‌కతాకి డు ఆర్ డై మ్యాచ్
కాగా ప్లేఆఫ్స్ కు చేరిన జట్లలో చెన్నై నాలుగు సార్లు, ముంబై మూడు సార్లతో ముందంజలో ఉంది. ఇక 2024 ఛాంపియన్స్ కోల్‌కతాకి ఇది డు ఆర్ డై మ్యాచ్. ఒకవేళ కోల్‌కతా జట్టు ఓడిపోతే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 57 మ్యాచ్‌లు జరిగాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు పాయింట్ల పట్టికలో టాప్-3లో ఉన్నాయి. గుజరాత్, బెంగళూరు జట్లు 16- పాయింట్లతో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 12 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటివరకు 35 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. బెంగళూరు 15, కోల్‌కతా 20 మ్యాచ్‌ల్లో గెలిచాయి.చిన్నస్వామిలో స్టేడియంలలో కోల్‌కతాకి అసాధారణ రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 15 ఆటల్లో 10 మ్యాచ్ లలో గెలిచింది.
Also Read : అటెండర్ను చెప్పుతో కొట్టిన మహిళా సీఐ
Also Read : ట్రంప్ పరువు పోయింది.. అమెరికా చరిత్రలోనే తొలి దారుణ పరాభవం!
kolkata-knight-riders | royal-challengers-bengaluru | virat-kohli | telugu-news