/rtv/media/media_files/2025/01/15/uN5LmIjBE0XL5VTKLOR6.jpg)
ind vs ire Indian women cricket team set new record in ODI
IND w Vs IRE: భారత మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో 435 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి, ప్రతీకా రావల్ సెంచరీలతో చెలరేగారు. ఇండియాకు ఇది మొదటిసారి కాగా మహిళా క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరు.
క్రికెట్ చరిత్రలో నాలుగో స్కోరు..
ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత టీమ్.. నామమాత్రపు మూడో వన్డేలో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన (135: 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు), ఓపెనర్ ప్రతీకా రావల్ (154: 129 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్) భారీ సెంచరీలతో ఐర్లాండ్ బౌలర్లను ఆడేసుకున్నారు. వీరిద్దరే కాదు వన్‌డౌన్‌లో వచ్చిన రిచా ఘోష్ (59: 10 ఫోర్లు, ఒక సిక్స్) దంచికొట్టింది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 రన్స్ చేసింది.
అయితే ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. కాగా రెండో వన్డేలో ఐర్లాండ్ పైనే రెండో అత్యధిక స్కోర్ 370/5 చేసింది. ఇప్పుడు మరోసారి ఆ రికార్డును అధిగమించగా.. మహిళా క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు. 2018లో ఐర్లాండ్‌పైనే కివీస్ మహిళల జట్టు 491/4 పరుగులు చేసింది.
ఇది కూడా చదవండి: Telangana: చైనా మాంజా తగిలి వ్యక్తి మెడకు గాయం.. చివరికీ
అత్యంత వేగంగా పదో సెంచరీ..
ఇక కెప్టెన్ స్మృతి మంధాన కెరీర్‌లో పదో సెంచరీ చేయగా.. భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన బ్యాటర్‌గా నిలిచింది. ఆమె 70 బంతుల్లోనే శతకం బాదేసింది. వరుసగా ఆమెకు రెండో సెంచరీ. మంధాన-ప్రతీకా రావల్ తొలి వికెట్‌కు 233 పరుగులు చేసింది. మహిళల వన్డే చరిత్రలో ఇది 6వ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం.