టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆరుస్థానాలు కిందికి దిగారాడు. దీంతో అతని స్థానం 1 కు పడిపోయింది. మరోవైపు స్టార్ బ్యాటర్ కోహ్లీ కూడా 5 స్థానాలు డౌన్ అయి 20వ ర్యాంకులో నిలిచాడు. ఇండియా–ఆస్ట్రేలియా టెస్ట్‌లో రోహిత్, విరాట్‌లు ఇప్పటివరకూ ఏమీ ఆడలేదు. రెండు టెస్ట్ మ్యాచ్‌లలోనూ వారి స్కోర్లు సింగిల్ లేదా అతి తక్కవు డబుల్ డిజిట్లకు పరిమితమయ్యాయి. దీని ప్రభామే టెస్ట్ ర్యాంకింగ్స్ మీద పడింది. ఇక టెస్ట్ ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్ నాలుగో ప్లేస్‌లో కొనసాగుతుండగా.. రిషభ్ పంత్ మూడు స్థానాలు కోల్పోయి 9వ ర్యాంకుకు పడిపోయాడు. శుభ్‌మన్ గిల్ మాత్రం ఒక స్థానం మెరుగై 17వ ర్యాంకులో నిలిచాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఆరు స్థానాలు ఎగబాకి 69వ స్థానం దక్కించుకున్నాడు. Also Read : Inter Exams: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ Also Read : మోహన్‌బాబు మేనేజర్ వెంకట కిరణ్ అరెస్ట్ మొదటి స్థానంలో బ్రూక్.. టెసట్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఇంగ్లాండ్ బ్యాటర్ బ్రూక్ నిలిచాడు. ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 899 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇతను ఒక్క పాయింట్ తేడాతో జో రూట్ (897)ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్‌తో పింక్ టెస్టులో భారీ శతకం బాదిన ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ టాప్-10లోకి వచ్చాడు. అతను ఆరు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అశ్విన్ ఒక స్థానం డౌన్ ఐదులో, రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఉన్నాడు. Also Read: EPF: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా..కేంద్రం ఏర్పాట్లు Also Read : వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. అధికారులకు కీలక ఆదేశాలు!