EPF: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా..కేంద్రం ఏర్పాట్లు

ఏటీఎంల ద్వారా పీఎఫ్​ ను విత్‌డ్రా చేసుకునే విధంగా త్వరలో ఏర్పాట్లు చేస్తామని కార్మికశాఖ కార్యదర్శి సుమిత దావ్రా తెలిపారు. కార్మికులకు మెరుగైన సేవల కోసం కార్మిక మంత్రిత్వ శాఖ తన ఐటీ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోందన్నారు.

New Update
EPFO: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే దీపావళి కానుక.. పీఎఫ్ పై కీలక ప్రకటన!

 

ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విషయంలో ఇంక టెన్షన్ అవసరం లేదని తెలిపింది. ఈపీఎఫ్‌ఓ చందాదారులు నేరుగా ఏటీఎంల ద్వారా తమ పీఎఫ్‌ను విత్‌ డ్రా చేసుకునే అవకాశం త్వరలోనే కల్పించనున్నట్లు కార్మికశాఖ కార్యదర్శి సుమిత దావ్రా ప్రకటించారు.  ఏటీఎంల ద్వారా చందాదారులు, లబ్ధిదారులు ఈ నగదును సులభంగా పొందవచ్చన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచే ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని సుమిత తెలిపారు. 

టెక్నాలజీ మెరుగు..

కార్మికులకు మెరుగైన సేవల కోసం కార్మిక మంత్రిత్వ శాఖ తన ఐటీ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోందని కారయదర్శి సుమిత తెలిపారు. ఈపీఎఫ్ విషయంలో టెక్నాలజీని అబివృధి చేస్తున్నామని ఎప్పారు. రెండు, మూడు నెలల్లోనే ఇదంతా సెట్ అవ్వొచ్చని...వచ్చే ఏడాది జనవరి కల్లా ఈ సైకర్యం అందబాటులోకి రావొచ్చని చెప్పారు. ఈపీఎఫ్‌వో సేవలను మరింత మెరుగుపరచడంతోపాటు జీవన సౌలభ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి పీఫ్ ఖాతా అనేది ఉంటుంది. మనకు నెల నెలా క్రెడిట్ అయ్యే శాలరీ నుంచి కొంత మొత్తం ఈ పీఎఫ్ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. అయితే వీటిని విత్ డ్రా చేసుకోవాలంటే.. వెబ్ సైట్ కు వెళ్లి చేసుకోవాలి. దీని కోసం ఈపీఎఫ్ఓ యాప్ ఉమంగ్ అందుబాటులో ఉంది. ఉమంగ్ యాప్ ద్వారా కూడా EPFO ​​సేవలను యాక్సెస్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీ పీఎఫ్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో తెలుసుకోవచ్చు. అంతే కాదు.. దీని నుంచి కూడా మీ పీఎప్ ఖాతాలో డబ్బులను డ్రా చేసుకోవచ్చు. దీనిని మీ మొబైల్ నుంచే డైరెక్ట్ గా చూసుకునే వీలుంటుంది.  ఇప్పటి వరకూ ఈ విధానమే అమల్లో ఉంది. 

Also Read: China: తైవాన్  జలదిగ్భంధం..చైనా ఆక్రమణ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు