/rtv/media/media_files/2025/07/20/maiosts-2025-07-20-09-13-01.jpg)
Six Maoists died
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఇంకా పోరాటం జరుగుతూనే ఉంది. తాజాగా నారాయణపూర్ జిల్లా అబూజ్‌మాడ్ ప్రాంతంలో మావోయిస్టుల సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు ఉమ్మడి బృందాలు సర్చ్ ఆపరేషన్స్ ప్రారంభించాయి. అప్పుడు జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. దాంతో పాటూ ఘటనా స్థలం నుంచి ఏ.కె. 47 రైఫిల్, ఎస్.ఎల్.ఆర్. రైఫిల్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలును స్వాధీనం చేసుకున్నారు. ఓవైపు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే.. మరోవైపు శుక్రవారం మధ్యాహ్నం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నాయి. ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నందున, ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మరిన్ని వివరాలను అందించలేకపోతున్నామని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ పూర్తయిన తర్వాత డీటెయిల్డ్ నోట్ విడుదల చేస్తామని చెప్పారు.
దేశ వ్యాప్తంగా ఎన్ కౌంటర్లు..
దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నట్లే దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు పలువురు అశువులు బాశారు.మరోవైపు పలువురు మావోయిస్టు నేతలు లొంగుబాటు బాట పడుతున్నారు. తాజాగా జన నాట్యమండలి వ్యవస్థాపకుడు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శివర్గ సభ్యుడు సంజీవ్ అలియాస్ లెంగు దాదా, అతని భార్య రాష్ట్ర కమిటీ సభ్యురాలు పెరుగుల పార్వతి అలియాస్ బొంతల పార్వతి అలియాస్ దీనా గురువారం హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు.