ENG vs IND : ఐదో టెస్టులో 224 పరుగులకు టీమిండియా ఆలౌట్

లండన్‌లోని ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. భారత్ 224 పరుగులకే ఆలౌట్ అయింది.  భారత జట్టులో  కరుణ్ నాయర్ (52), సాయి సుదర్శన్ (38),  వాషింగ్టన్ సుందర్ (25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.

New Update
ENG

లండన్‌లోని ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌  లో భారత్ 224 పరుగులకే ఆలౌట్ అయింది.  భారత జట్టులో  కరుణ్ నాయర్ (52), సాయి సుదర్శన్ (38),  వాషింగ్టన్ సుందర్ (25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత బ్యాట్స్‌మెన్లలో చాలామంది మంచి ఆరంభాలు లభించినప్పటికీ, వాటిని పెద్ద స్కోర్లుగా మార్చలేకపోయారు. ముఖ్యంగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తక్కువ పరుగులకే అవుటయ్యారు.

Also Read :  IND vs ENG: ఇంగ్లాండ్ టీమ్ కు బిగ్ షాక్‌ .. ఐదో టెస్టు నుంచి క్రిస్ వోక్స్‌ ఔట్!

20 పరుగులకే 4 వికెట్లు 

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా 21 పరుగులకే రనౌట్ అవ్వడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.  ఇంగ్లాండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, స్టువర్ట్ బ్రాడ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అట్కిన్సన్, టంగ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, బ్రాడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీసుకున్నాడు. 204/6 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 20 పరుగులు జోడించి మిగితా 4 వికెట్లు కోల్పోయింది.  

Also Read :  Shubman Gill: 47 ఏళ్ల రికార్డు బద్దులు.. సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్‌ చేసిన గిల్!

ఇంగ్లాండ్ టీమ్ కు బిగ్ షాక్‌

ఇంగ్లాండ్ టీమ్ కు బిగ్ షాక్‌ తగిలింది. ఐదో టెస్టులో తొలి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన క్రిస్ వోక్స్ ఐదో టెస్టు నుంచి వైదొలగాడు. అతడి గాయం తీవ్రంగా ఉండటంతో మ్యాచ్‌ నుంచి వైదొలగినట్లు ఇంగ్లాండ్‌ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. రెండో రోజు ఆటకు ముందు ఈ ప్రకటన వచ్చింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అత్యధిక బంతులు వేసిన వోక్స్, ది ఓవల్‌లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతని భుజానికి గాయం అయింది. దీంతో అతను తిరిగి ఫీల్డ్ లోకి రాలేదు.  ఇప్పుడు గాయం కూడా తీవ్రం కావడంతో  అతడు మ్యాచ్‌ నుంచి వైదొలగినట్లుగా టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది.  ఓవల్ టెస్టు మొదటి రోజు ఆటలో గాయంతో వైదొలిగే ముందు అతను 14 ఓవర్లు బౌలింగ్ చేసి 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. 

telugu-news | ind-vs-eng | latest-telugu-news | telugu-sports-news | telugu-cricket-news

Advertisment
తాజా కథనాలు