/rtv/media/media_files/2025/08/01/wokes-2025-08-01-15-10-16.jpg)
ఇంగ్లాండ్ టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. భారత్‌తో ఐదో టెస్టులో తొలి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన క్రిస్ వోక్స్ ఐదో టెస్టు నుంచి వైదొలగాడు. అతడి గాయం తీవ్రంగా ఉండటంతో మ్యాచ్ నుంచి వైదొలగినట్లు ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. రెండో రోజు ఆటకు ముందు ఈ ప్రకటన వచ్చింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అత్యధిక బంతులు వేసిన వోక్స్, ది ఓవల్‌లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతని భుజానికి గాయం అయింది. దీంతో అతను తిరిగి ఫీల్డ్ లోకి రాలేదు.
A huge blow for England !
— Cric Updates (@CricUpdate58494) August 1, 2025
Chris Woakes has been ruled out of the remainder of the 5th Test against India due to a left shoulder injury sustained on Day 1.#INDvsENG#ENGvINDpic.twitter.com/nqCvyOB0qD
Also Read : 47 ఏళ్ల రికార్డు బద్దులు.. సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేసిన గిల్!
సిరీస్ అంతటా అద్భుతంగా బౌలింగ్
ఇప్పుడు గాయం కూడా తీవ్రం కావడంతో అతడు మ్యాచ్ నుంచి వైదొలగినట్లుగా టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. ఓవల్ టెస్టు మొదటి రోజు ఆటలో గాయంతో వైదొలిగే ముందు అతను 14 ఓవర్లు బౌలింగ్ చేసి 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. కాగా ఐదు టెస్టుల్లోనూ ఆడిన వోక్స్, ఇంగ్లాండ్ సిరీస్ అంతటా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. రెండు జట్లలో అందరికంటే ఎక్కువగా 181 ఓవర్లు బౌలింగ్ చేసి 11 వికెట్లు పడగొట్టాడు. అతని గాయం ఇంగ్లాండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన బౌలర్లలో వోక్స్ ఒకడు. ఇక ఈ సిరీస్‌లో అతనితో పాటు భారత పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా ఐదు టెస్టులనూ ఆడాడు.
ఏడో వికెట్‌కు 51 పరుగులు
లండన్‌లోని ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో మొదటి రోజు ఆట వర్షం వల్ల పలుమార్లు ఆగిపోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు మొదటి రోజు ఆటను డామినేట్ చేసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 6 వికెట్లకు 204 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు భారత టాప్ ఆర్డర్ తడబడింది. గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ చెరో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ బౌలింగ్‌ను పటిష్టం చేశారు. క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీసుకున్నాడు. కరుణ్ నాయర్‌కు తోడుగా వాషింగ్టన్ సుందర్ (19 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 51 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వర్షం కారణంగా మొదటి రోజు కేవలం 64 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. రెండో రోజు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్‌ల భాగస్వామ్యంపై భారత స్కోరు ఆధారపడి ఉంది.
Also Read : ఢిల్లీకి బిగ్ షాక్.. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్!
ind-vs-eng | telugu-news | latest-telugu-news | telugu-sports-news | telugu-cricket-news