Shubman Gill: 47 ఏళ్ల రికార్డు బద్దులు.. సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్‌ చేసిన గిల్!

భారత టెస్ట్ కెప్టెన్‌ శుభ్‌మాన్ గిల్‌ 47 ఏళ్ల మైలురాయిని బద్దలు కొట్టాడు.  ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు సునీల్ గావస్కర్ పేరిట ఉంది.

New Update
gill

Shubman Gill: భారత టెస్ట్ కెప్టెన్‌ శుభ్‌మాన్ గిల్‌ 47 ఏళ్ల మైలురాయిని బద్దలు కొట్టాడు.  ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు సునీల్ గావస్కర్ పేరిట ఉంది.  సునీల్ గావస్కర్ 1978/79లో వెస్టిండీస్‌పై 732 పరుగులు చేశాడు. 1978లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సునీల్ గవాస్కర్ చేసిన 732 పరుగుల చేశాడు.  ఇప్పుడు ఆ రికార్డును గిల్ (737*) బ్రేక్ చేశాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఓవల్ గ్రౌండ్ లో ఇంగ్లండ్ జట్టుతో జరుగుతోన్న ఐదు టెస్టు మ్యాచ్ లో భారత జట్టు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. ఆదిలోనే భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు.  ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన గిల్ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. లంచ్ టైమ్ కు భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ప్రస్తుతం సాయి సుదర్శన్ (25*), శుభ్‌మన్ గిల్ (15*) క్రీజులో ఉన్నారు. 

ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్లు


737* - శుభ్‌మన్ గిల్ (ఇంగ్లాండ్‌పై) 2025
732 - సునీల్ గావస్కర్ (వెస్టిండీస్‌పై) 1978/79
655 - విరాట్ కోహ్లీ (ఇంగ్లాండ్‌పై) 2016/17
610 - విరాట్ కోహ్లీ (శ్రీలంకపై) 2017/18
593 - విరాట్ కోహ్లీ (ఇంగ్లాండ్‌పై) 2018 

కెప్టెన్‌గా ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు డాన్ బ్రాడ్‌మాన్ పేరు మీద ఉంది. 1936-37లో ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్‌లో, బ్రాడ్‌మాన్ ఐదు మ్యాచ్‌లు ఆడి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో మొత్తం 810 పరుగులు చేశాడు. 88 ఏళ్ల నాటి ఆ రికార్డును బద్దలు కొట్టాలంటే గిల్ ఐదవ టెస్ట్‌లో కనీసం 89 పరుగులు చేయాలి. ఇక  ఇప్పటివరకు భారత్,ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు లెజెండరీ ఇంగ్లీష్ బ్యాటర్ గ్రాహం గూచ్ పేరు మీద ఉంది. గూచ్ 1990లో భారత్ తో  మూడు టెస్టులు ఆడి 752 పరుగులు చేశాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా భావిస్తుంటే ఇందులో గెలిచి సిరీస్ దక్కించుకోవాలని ఇంగ్లాండ్ ప్లాన్ లో ఉంది. మొత్తానికి ఈ మ్యాచ్ డ్రా అయిన ఓడిపోయిన భారత్ మాత్రం సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది. సో ఇది ఇండియాకు డూ అర్ డై మ్యాచ్ అన్నమాట. భారత్ తుది జట్టులో నాలుగు మార్పులు చేసింది . అన్షుల్ కాంబోజ్ స్థానంలో ఆకాష్ దీప్ ,  పంత్, శార్దూల్, బుమ్రా స్థానంలో జురెల్, కరుణ్, ప్రసిద్ధ్ లను తుదిజట్టులోకి  తీసుకున్నారు. 

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్ ), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్( వికెట్ కీపర్ ), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్యూ 

Advertisment
తాజా కథనాలు