/rtv/media/media_files/2025/07/05/india-vs-england-2nd-test-mohammed-siraj-set-record-in-edgbaston-for-six-wicket-knocked-down-2025-07-05-15-47-06.jpg)
india vs england 2nd test mohammed siraj set record in edgbaston for six wicket Knocked down
భారత్ vs ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగానే మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండి తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. మొత్తం 587 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
అనంతరం ఈ టార్గెట్‌ను ఛేదించేందుకు దిగిన ఇంగ్లాండ్ జట్టు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. వికెట్లు పడినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పరుగులు రాబట్టింది. కానీ టీమిండియా బౌలర్ మొహమ్మద్ సిరాజ్ దాటికి తట్టుకోలేకపోయారు. సిరాజ్ తన బౌలింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 19.3 ఓవర్లలో 70 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
Also Read: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!
ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించిన సిరాజ్
ఇంగ్లాండ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేయడం ద్వారా సిరాజ్ తన కెరీర్‌లో మరో ఫీట్ సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో 5 వికెట్లు తీసిన ఐదవ బౌలర్‌గా అతడు నిలిచాడు. ఇది మాత్రమే కాకుండా మరో అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
◾ 5-73 in AUS
— ESPNcricinfo (@ESPNcricinfo) July 5, 2025
◾ 5-60 in WI
◾ 6-15 in SA
◾ 6-70 in ENG
Four Test five-wicket hauls for Mohammed Siraj ✋ pic.twitter.com/riudBjrKwL
Also Read : రూ. 20వేలలో బెస్ట్ స్మార్ట్‌టీవీలు - మార్కెట్లో దుమ్మురేపుతున్న మోడల్స్ ఇవే!!
సిరాజ్ ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించాడు. 1993 తర్వాత పర్యాటక జట్టు నుంచి వచ్చిన ఒక బౌలర్ ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో 6 వికెట్లు పడగొట్టడం ఇదే మొదటి సారి. తొలి ఇన్నింగ్స్‌లో జాక్ క్రౌలీ, జో రూట్, బెన్ స్టోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్‌లను అతడు ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు.
A determined spell applauded by his teammates 🙌
— BCCI (@BCCI) July 4, 2025
Mohd. Siraj with a memorable bowling performance in Edgbaston 👏👏
Scorecard ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @mdsirajofficialpic.twitter.com/329eBuD5YJ
Also Read : పెళ్లికాకుండా తల్లికాబోతున్న నటి.. 40 ఏళ్లలో IVF ద్వారా!
mohammad-siraj | IND VS ENG TEST SERIES 2025 | IND VS ENG 2ND TEST | ind-vs-eng