భారత్ vs ఆస్ట్రేలియా.. తొలిరోజు వరుణుడిదే ఆధిక్యం.. వారమంతా వర్షాలే!

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు ఇవాళ గబ్బా వేదికగా ప్రారంభమైంది. మ్యాచ్‌ మొదలైన కాసేపటికి వరుణుడి గండం ఎదురైంది. తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఆసీస్‌ తొలిరోజు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.

New Update
ind vs aus 3rd test

బోర్డర్‌ గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్ చాలా రసవత్తరంగా నడుస్తోంది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. మొత్తం ఐదు సిరీస్‌లలో ఇప్పటికే రెండు సిరీస్‌లు కంప్లీట్ అయ్యాయి. అందులో భారత్ తొలి సిరీస్ కైవసం చేసుకోగా.. రెండో సిరీస్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. ఇక మూడో సిరీస్‌ కోసం రెండు జట్టు సిద్ధమయ్యాయి. 

ఈ మూడో సిరీస్ ఇవాళ (డిసెంబర్ 14)న బ్రిస్బేన్‌లో గబ్బా స్టేడియం వేదికగా ప్రారంభం అయింది. కానీ ప్రారంభమైన గంట సేపటికే వర్షం కారణంగా ఆట ముగిసింది. మూడో టెస్టుకు వరుణుడి గండం ఎదురైంది. తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. దీంతో కేవలం రెండున్నర సెషన్లకి ఆట ముగిసింది. దీంతో మ్యాచ్‌ను చూద్దామని ఎంతో ఆసక్తిగా వచ్చిన వారికి తీవ్ర నిరాశే మిగిలింది. 

Also Read: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!

టాస్ గెలిచిన భారత్

ఇక గ్రౌండ్‌లోకి వచ్చే ముందు వాతావరణం బాగానే ఉంది. సర్లే అంతా బాగానే ఉందని టాస్ వేశారు. టాస్‌లో భారత్ నెగ్గి బౌలింగ్ సెలెక్ట్ చేసుకుంది. భారత బౌలర్లు, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ తమ బౌలింగ్‌ అదరగొట్టేశారు. కానీ వేసిన 13 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అదే సమయంలో ఆస్ట్రేలియా ఓపెనర్లు నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా వికెట్ పడకుండా బాగా రాణించారు. తొలి రోజు ముగిసేసరికి వికెట్ పోకుండా 28 పరుగులు చేశారు. అందులో మెక్‌స్వీనీ 4 నాటౌట్, ఖవాజా 19 నాటౌట్‌గా క్రీజ్‌లో ఉన్నారు. 

Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...

ఇవాళ ఆట మొదలై గంట సేపటికే వర్షం పడటంతో ఆట ముగిసింది. దీంతో రెండో రోజు అంటే రేపు (ఆదివారం) మరిన్ని ఓవర్లు పొడిగించారు. వాతావరణం అంతా అనుకూలిస్తే దాదాపు 98 ఓవర్ల పాటు ఆట కొనసాగించే ఛాన్స్ కనిపిస్తోంది.

Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు

అది మాత్రమే కాకుండా అరగంట ముందుగానే ప్లేయర్లు గ్రౌండ్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. వర్షం కారంగా తొలి రోజు ఆట ముగియడంతో క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం వారికి అదిరిపోయే వార్త చెప్పింది. టికెట్ల అమౌంట్‌ను రిఫండ్ చేస్తామని తెలిపింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు