PM Modi: 75 ఏళ్ళ రాజ్యాంగంపై మోదీ ప్రసంగం..దద్ధరిల్లిన లోక్‌సభ పార్లమెంటుల శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ జరిగింది. దీనిపై ప్రధాని మోదీ ప్రసంగించారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్య యాత్రను దేశ పౌరులు సాధించిన గొప్ప విజయంగా మోదీ అభివర్ణించారు. By Manogna alamuru 14 Dec 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ప్రధాని మోదీ రాజ్యాంగం ప్రసంగంతో ఈరోజు లోక్‌సభ దదధరిల్లింది. 75 ఏళ్ళ భారత రాజ్యాంగ, ప్రజాస్వామ్యం ప్రయాణాన్ని ఆయన అభివర్ణించిన తీరు అందరినీ కట్టుకుంది. మరోసారి తన మాటల గారడీతో మోదీ అందరిమెప్పును పొందారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని.. మన దేశం మొత్తం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణం మన సంస్కృతిలో భాగమన్నారు ప్రధాని. 75 ఏళ్లలో భారతదేశం అసాధారణ విజయాలు సాధించింది. ఎన్నో సవాళ్లను అధిగమించి ముందుకు సాగింది. ఈ శక్తిని ప్రజాస్వామ్యం మనకు అందించింది. అందుకే మన ప్రజాస్వామ్య గొప్పదనాన్ని చాటి చెప్పుకోవాలి. ఈ రోజు పండుగ జరుపుకోవాలి అంటూ మోదీ ఎమోషనల్ గా మాట్లాడారు. దీనికి కారణం అయిన రాజ్యాంగ కర్త అయిన బాబా సాహెబ్ అంబేద్కర్‌ను ప్రధాని గుర్తు చేసుకున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య పునాదిని బలోపేతం చేయడంలో రాజర్షి టాండన్, అంబేడ్కర్ వంటి మహానుభావులు ముఖ్యమైన పాత్ర పోషించారని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీశారు.. పనిలో పనిగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. మన రాజ్యాంగ ఔన్నత్యానికి ఆ పార్టీ చేసిన నష్టం అంతా ఇంతా కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. భిన్నత్వంలో ఏకత్వ భావనను ఆ పార్టీ అర్థం చేసుకోలేదని అన్నారు. దేశాన్ని ఒకే కుటుంబం 55 ఏళ్ళ పాటూ పాలించింది. అనేక విధాలుగా నష్టం కలిగించిందని మండిపడ్డారు. రాజ్యాంగ మార్పుపై రాష్ట్రాల సీఎంలకు నెహ్రూ లేఖలు రాశారు. ఆయన తప్పు చేస్తున్నారని బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా చెప్పారు. ఎంతోమంది పెద్దలు సలహాలు ఇచ్చినా నెహ్రూ వినలేదు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు అనేకసార్లు ప్రయత్నించారని మోదీ చెప్పారు. రాజ్యాంగాన్ని 75 సార్లు సవరణలు చేశారు. ఎమర్జెన్సీ విధించి ప్రజలను ఇబ్బందులు పెట్టారు. ఓటు బ్యాంకు కోసం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ ముగ్గురూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని అన్నారు. Also Read : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి