భారత్ vs ఆస్ట్రేలియా.. తొలిరోజు వరుణుడిదే ఆధిక్యం.. వారమంతా వర్షాలే!
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు ఇవాళ గబ్బా వేదికగా ప్రారంభమైంది. మ్యాచ్ మొదలైన కాసేపటికి వరుణుడి గండం ఎదురైంది. తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఆసీస్ తొలిరోజు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.