🔴Cyclone Montha: తుఫాన్‌ బీభత్సం కోనసీమలో పెను విలయం.. లైవ్ అప్ డేట్స్!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా అర్థరాత్రి సమయంలో తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు సమీపంలోని నరసాపురానికి దగ్గరలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య మొంథా తుపాను తీరం దాటినట్లు వెల్లడించారు.

author-image
By Lok Prakash
New Update
MONTHA CYCLONE

MONTHA CYCLONE

Cyclone Montha Live Updates

Weather Update: తీరం దాటిన మొంథా తుపాను.. ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా అర్థరాత్రి సమయంలో తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు సమీపంలోని నరసాపురానికి దగ్గరలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య మొంథా తుపాను తీరం దాటినట్లు వెల్లడించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా అర్థరాత్రి సమయంలో తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు సమీపంలోని నరసాపురానికి దగ్గరలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య మొంథా తుపాను తీరం దాటినట్లు వెల్లడించారు. అయితే మొంథా తుపాను తీరం దాటినప్పటికి తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుపాను తెలంగాణ మీదుగా ఛత్తీస్‌గఢ్ దగ్గర బలహీన పడే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో ఏపీతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. 

  • Oct 29, 2025 14:03 IST

    Montha Cyclone: ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు సాయం.. తుఫాన్ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ శుభవార్త!

    ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మొంథా తుఫాను ప్రభావం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుపాను బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

     

    AP govt to provide financial aid to cyclone victims
    AP govt to provide financial aid to cyclone victims

     



  • Oct 29, 2025 13:43 IST

    అమరావతి బ్రేకింగ్..

    • మొంథా తుఫాను బాధితులకు ఆర్థికసాయం అందించేెందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
    • పునరావాస కేెంద్రాలకు వచ్చిన బాధితులకు  ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు 
    •  బాధితుడికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు 
    • కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ ఉన్నా గరిష్టంగా 3వేలు సాయం అందివ్వాలని ఆదేశాలు
    • బాధితులు పునరావాస కేంద్రం నుంచి ఇళ్లకు వెళ్లే ముందు 3వేలు  ఆర్థిక  సాయం చేయాలని ఆదేశాలు 
    • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన విపత్తు నిర్వహణ శాఖ  స్పెషల్ సీఎస్  సాయి ప్రసాద్



  • Oct 29, 2025 12:54 IST

    శ్రీశైలం బ్రేకింగ్..

     

    • శ్రీశైలంలో  మొంథా తుఫాన్ భయానక పరిస్థితులు,
    • శ్రీశైలంలో మొంథా తుఫాన్ భారీ ప్రభావం,
    • ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఇళ్లల్లోకి భారీగా చేరిన వరద,
    • అర్ధరాత్రి నుంచి నరకయాతన అనుభవిస్తున్న శ్రీశైలం ప్రజలు,
    • అర్ధరాత్రి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలింతలు
    • కొత్తపేటలోని పలు కాలనీలలో నదులను తలపిస్తున్న ఇల్లులు,
    • ఇళ్లల్లోకి భారీగా వరద చేరడంతో నిరాశ్రుయులైన కొన్ని బీద కుటుంబాలు,
    • దేవుడే కాపాడాలంటూ వేడుకుంటున్న ప్రజలు,



  • Oct 29, 2025 12:13 IST

    Cyclone Montha: తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారో తెలుసా..?

    తుఫాన్లకు పేర్లు పెట్టడం ప్రజలకు ప్రమాద హెచ్చరిక ఇచ్చేందుకు, తుఫాన్లను సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఆరు ప్రధాన వాతావరణ కేంద్రాలు, ఐదు ప్రాంతీయ కేంద్రాలు పేర్లను నిర్ణయిస్తాయి. దీని కోసం స్థానిక భాషల, సంప్రదాయాల పేర్లు ఉపయోగిస్తారు.

     

    Cyclone Montha
    Cyclone Montha

     



  • Oct 29, 2025 12:12 IST

    Cyclone Montha Effect



  • Oct 29, 2025 12:12 IST

    Cyclone Montha Effect



  • Oct 29, 2025 10:31 IST

    Trains Cancelled: సైక్లోన్ 'మొంథా' ఎఫెక్ట్: ఆ రైళ్లు రద్దు.. ప్రయాణికులకు టోటల్ రిఫండ్..

    సైక్లోన్ 'మొంథా' ప్రభావం కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే కొన్ని రైళ్లు సికింద్రాబాద్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (Oct 29), హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (Oct 30) రద్దు చేసింది. ప్రయాణికులు రిఫండ్ పొందవచ్చు.

     

    Trains Cancelled
    Trains Cancelled

     



  • Oct 29, 2025 08:14 IST

    విజయవాడలో దంచికొడుతున్న వర్షం

    -- ఏపీలో మొంథా తుఫాన్‌ బీభత్సం
    -- విజయవాడలో దంచికొడుతున్న వర్షం
    -- వర్షపునీటితో నిండిపోయిన ప్రధాన రహదారులు
    -- నేడు కూడా విద్యా, వ్యాపార సంస్థలు బంద్
    -- కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం
    -- తుఫాన్ ఎఫెక్ట్‌తో మచిలీపట్నంలో కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు
    -- రోడ్లపై చెల్లాచెదురుగా విద్యుత్ వైర్లు, తెగిపడ్డ చెట్లు
    -- మచిలీపట్నంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం



  • Oct 29, 2025 07:57 IST

    Cyclone Montha Effect



  • Oct 29, 2025 07:56 IST

    నందిగామ లో తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ వర్షం..

    ఎన్టీఆర్ జిల్లా నందిగామ.. ఉదయం 2 గంటల నుంచి భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం నీట మునిగిన రోడ్లు



  • Oct 29, 2025 07:39 IST

    పశ్చిమగోదావరి బేకింగ్..

    • అంతర్వేదిలో తుఫాన్ బీభత్సం 
    • 100 కి.మీ వేగంతో విస్తున్న గాలులు 
    • అల్లకల్లోలంగా మారిన సముద్ర ప్రాంతం 
    • ఆర్ టివితో స్థానిక మత్స్యకారులు
    • మేమెప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు 
    • ఈ గాలులు చాలా విపరీతంగా వున్నాయి 
    • 1996 లో ఇలాంటి ఘటన చూసాం...ప్రస్తుతం ఈ తుఫాన్ దానికి మించి ఉంది 
    • రాత్రి భారీగా సముద్రం కెరటాలు ముందుకు వచ్చాయి



  • Oct 29, 2025 06:37 IST

    రాబోయే 3-4 గంటల్లో మధ్య ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, గాలులు



  • Oct 29, 2025 06:36 IST

    మొంత తుఫాను ఆంధ్రాలో గంటకు 100 కి.మీ వేగంతో తీరాన్ని తాకింది

    తుఫాను తీరం దాటడం ప్రారంభించగానే, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక తీరప్రాంత జిల్లాలను భారీ గాలులు, వర్షం ముంచెత్తాయి, గాలుల వేగం గంటకు 90 నుండి 100 కి.మీ.లకు చేరుకుంది.



  • Oct 29, 2025 06:34 IST

    మోంతా తుఫానుపై సమీక్షా సమావేశానికి సీఎం మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షత వహించారు.

    ఒడిశా ప్రమాదంలో లేదు, అన్ని పరిస్థితులకు మా జట్టు సిద్ధంగా ఉన్నాయి. 



  • Oct 29, 2025 06:32 IST

    Cyclone Montha Live Updates



Advertisment
తాజా కథనాలు