IND Vs ENG: ‘ఆ ఇద్దరు వెళ్లిపోవడానికి నువ్వే కారణం’.. గౌతమ్ గంభీర్‌పై ఫ్యాన్స్ ఫైర్!

మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లాండ్ పట్టు సాధించడంతో.. భారత కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ త్వరగా రిటైర్ కావడానికి గంభీర్ ప్రధాన కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Gautam Gambhir Slammed For Poor Tactics After England Makes Solid Mark

india coach slammed as england take control in manchester test

భారత్ vs ఇంగ్లాండ్ మధ్య రసవత్తరమైన టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికి జరిగిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ ఒకటి గెలవగా, ఇంగ్లాండ్ రెండు గెలుపులతో ముందంజలో ఉంది. ఇప్పుడు నాలుగో టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేయగా.. భారత్ 358 పరుగులు చేసింది. 

Also Read : పవిత్రమైన శ్రావణ మాసం.. ఈ పనులు చేశారో దరిద్ర దేవత మీ నెత్తిమీదే!

IND Vs ENG

దీంతో ఇంగ్లాండ్ 186 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెన్ స్టోక్స్ (77*), లియామ్ డాసన్ (21*) క్రీజులో ఉన్నారు. ఇవాళ నాలుగో రోజు ఆట ప్రారంభం అయింది. ఈ క్రమంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై నెటిజన్లు, క్రికెట్ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ త్వరగా రిటైర్ కావడానికి గంభీర్ ప్రధాన కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. 

Also Read : ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!

వారిద్దరూ ఇంకొంత కాలం ఆడే అవకాశం ఉన్నా.. బలవంతంగా టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారని సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెట్టారు. అనంతరం గంభీర్ తనకు దగ్గరి స్నేహితులను టీంలోకి తీసుకున్నాడని ఆరోపించారు. ఇది మాత్రమే కాకుండా ఈ నాలుగో టెస్ట్‌లో సీనియర్ అండ్ స్పిన్ స్పెషలిస్ట్ కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకోకుండా.. కుర్రాడు కంబోజ్‌ను తీసుకున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. సర్ఫరాజ్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను అస్సలు గంభీర్ పట్టించుకోలేదని, షమీని పక్కన పెట్టారన్నారు అంటూ.. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read : తిరుపతిలో కన్ను తెరిచిన శివయ్య.. గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసా?

Advertisment
తాజా కథనాలు